సొంత పార్టీలో ఉంటూ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్టీ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కూడా అలానే ఉన్నారు. కానీ జగన్ అవేమీ పట్టించుకోకుండా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరికను నెరవేర్చారు.
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త కుంపటిని రాజేసినట్లు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. ఈ క్రాస్ ఓటింగ్ ఘటను సీరియస్ తీసుకున్న పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వెలువడ్డ సంగతి అందరికీ విదితమే. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా. 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. గెలిచేందుకు తగినంత మెజార్టీ లేకపోయినప్పటికీ.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అనూహ్యంగా విజయం సాధించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరు గత కొంత కాలంగా వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీపైనే ఆయన విమర్శలు చేశాడు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేయడంతో.. ఈ విషయం రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి కోటంరెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై మంత్రి అంబటి ఫైర్ అయ్యారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి పోలీసులకు అల్టీమేటం ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా అక్కడి రాజకీయాలు సాగుతున్నాయి.
నెల్లూరు రాజకీయాల్లో ఈ మధ్య కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు తరచుగా వినిపిస్తోంది. అధికార పార్టీతో విభేదాలు.. ప్రతిపక్ష పార్టీకి దగ్గరవ్వటానికి ప్రయత్నాలు ఇలా కోటంరెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న పేరు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చి రెబల్ బావుటా ఎగరేశారు కోటంరెడ్డి.
ఫోన్ ట్యాప్ ఆరోపణలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన సంగతి తెలిసిందే. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. కోటంరెడ్డి వర్సెస్ వైఎస్సార్ సీపీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది.