ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏపీలో రాజకీయం వెెేడెక్కింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ చర్యలు తీసుకుంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారిలో ప్రముఖంగా ఉండవల్లి శ్రీదేవి పేరు వినిపిస్తోంది. ఇందుకే సీఎం చర్యలు తీసుకున్నారు అంటూ పలు కారణాలు చెబుతున్నారు.
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ వేటు వేసింది. అంతర్గత విచారణ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేసినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటికే పార్టీతో తమకున్న విభేదాలను బాహాటంగానే ప్రకటించారు. మేకపాటి కూడా కుటుంబ వివాదాలతోనే పార్టీతో విభేదిస్తున్నారు. కానీ, ఏ కారణం లేకుండా ఉండవల్లి శ్రీదేవిని ఎందుకు సీఎం జగన్ దూరం పెడుతున్నారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రచారంలో ఉన్నాయి.
గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఎస్సీ రిజర్వర్డ్ అయిన ఈ స్థానం నుంచి గతంలో గొప్ప గొప్ప నాయకులు వచ్చారు. 2019 ఎన్నికల్లో సీఎం జగన్ చొరవతో ఉండవల్లి శ్రీదేవి.. తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పై విజయం సాధించారు. అయితే విజయం తర్వాతి నుంచి ఉండవల్లి శ్రీదేవి పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజుల్లోనే వివాదాలకు కేంద్ర బింధువుగా మారారు. ప్రజలకు అస్సలు అందుబాటులో ఉండటం లేదనే చెడ్డ పేరును కూడా మూటగట్టుకున్నారు. అదే విషయంపై సీఎం జగన్ కు కూడా పలు నివేదికలు అందినట్లు చెప్పేవాళ్లు.
అందుకే డొక్కా మాణిక్య వరప్రసాద్ ని తాడికొండ నియోజకవర్క అదనపు సమన్యవకర్తగా నియామించారని చెబుతుంటారు. ఆ తర్వాత ఆ విషయాన్ని వ్యతిరేకిస్తూ.. ఉండవల్లి- ఆమె అనుచరులు తాడికొండలో నిరసనలకు దిగారు. తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్ సీఎం జగన్ గుంటూరు జిల్లా ఇన్ ఛార్జ్ గా నియమించారు. నియోజకవర్గంలో పార్టీని గెలిపించే బాధ్యతను అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ టికెట్ ను డొక్కాకే ఇస్తారంటూ అప్పట్లో బాగానే ప్రచారాలు జరిగాయి. అందుకే ఉండవల్లి శ్రీదేవి ఇష్టారీతిన ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రజలకు దూరమవ్వడం, ప్రతి విషయంలో నాకేంటి? అనే ధోరణి ప్రదర్శించే వారని ఆరోపిస్తున్నారు.
అలాగే ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, పేకాట క్లబ్బులు నిర్వహించేవారంటూ చాలానే ఆరోపణలు వచ్చాయి. పోలీసులతో కూడా ఇష్టారీతిన మాట్లాడుతారంటూ ఒక ఆడియో కూడా వైరల్ అవ్వడం చూశాం. ప్రజల్లో శ్రీదైవిపై ఎంతో వ్యతిరేకత ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు సీఎం జగన్ కు నివేదిక అందింది అంటూ చెబుతున్నారు. తనకి వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఎలాగూ పార్టీ నుంచి టికెట్ ఉండదని శ్రీదేవి ముందే ఫిక్స్ అయిపోయి ఇలా చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. వైసీపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్
ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది, ఆనంలను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని, పార్టీలో విచారణ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సజ్జల తెలిపారు.#YCP #AP #MLCElectionsInAP
— SumanTV (@SumanTvOfficial) March 24, 2023