భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకులకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. అయితే ఉత్సవాల్లో భాగంగా 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ మహానాయకుల్లో అల్లూరి ఒకరని ఆయన గుర్తు చేశారు.
ఆ తర్వాత మాట్లాడిన సీఎం జగన్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక దేశాన్ని మరో దేశం దోపిడి చేయకూడదనే సమాజాన్ని నిర్మించారని ఆయన అన్నారు. అల్లూరి ఒక అగ్ని కణం అని కూడా అన్నారు. ఇదిలా ఉంటే ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. దీంతో అతనిని కలిసేందుకు పలువురు మంత్రులు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ వేడుకల్లో ఓ అరుదైన ద్రుశ్యం ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి రాకను గమనించిన మంత్రి రోజా అతని వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించింది.
ఇది కూడా చదవండి: విప్లవ జ్యోతి అల్లూరి సీతారారమరాజు 125వ జయంతి వేడుకలు.. కుటుంబ సభ్యులు హాజరు!
అనంతరం అతనితో ఓ సెల్ఫీ కూడా తీసుకుంది. రోజా చిరంజీవితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కూడా సెల్ఫీ తీసుకోవడం విశేషం. అయితే గతంలో రోజా చిరంజీవితో అనేక సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే రోజా రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా చిరంజీవిని అభిమానిస్తూనే ఉంటుంది. ఈ వేడుకలో చిరంజీవితో రోజా తీసుకున్న ఈ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. చిరంజీవితో రోజా తీసుకున్న సెల్ఫీ ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.