ఏపీ అసెంబ్లీలో రాజుకున్న రాజకీయ రగడ ఇంకా చల్లారలేదు. ఆరోపణలు- ప్రత్యారోపణలు, విమర్శలు- ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడూ చంద్రబాబు అంటే ఎగిరిపడే కొడాలి నాని.. మరోసారి తనదైనశైలిలో స్పందించారు. నా భార్యను దుర్భాషలాడారు అని చంద్రబాబు లైవ్ లో ఏడ్చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు మద్దతుగా మాట్లాడిన వాళ్లు ఉన్నారు. ఆ ఘటన చూసి సంబరపడిన వాళ్లూ ఉన్నారు. ఆ ఘటన, అందుకు రిలేటెడ్ గా వస్తున్న విషయాలపై కొడాలి కామెంట్ చేశారు.
‘భార్య పేరు చెబితే కుటుంబం మొత్తం ఒకే తాటిపైకి వస్తుంది అనేది చంద్రబాబు ప్లాన్. ఆయన భార్య పేరు అసెంబ్లీలోగానీ, బయట గానీ ఎవరూ తీయలేదు. ఆయన భార్య పేరును ఆయనే అల్లరి చేసుకుంటూ.. మమ్మల్ని క్షమాపణ చెప్పమంటున్నారు. కొందరైతే జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. Jr ఎన్టీఆర్ చెప్తే మేమెందుకు వింటాం? ఎన్టీఆర్ కుటుంబం అంటే సీఎం జగన్ కు కూడా ప్రత్యేకమైన అభిమానం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ అమాయకులు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు వాళ్లు చంద్రబాబును నమ్ముతున్నారు’ అంటూ కొడాలి నాని కామెంట్ చేశారు.