పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యులు యర్రా నారాయణస్వామి బుధవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్య్లలతో బాధపడుతున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పార్లమెంట్ మాజీ సభ్యులు యర్రా నారాయణ స్వామి బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్య, వృద్ధాప్య సమస్య్లలతో బాధపడుతున్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నారాయణస్వామి ఏప్రిల్ 30న 1931లో జన్మించారు. ఆయన స్వగ్రామం ఉండి మండలం ఉప్పులూరు. నారాయణ స్వామి 1972లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి వచ్చారు.
యర్రా నారాయణ స్వామి 1985, 1999లలో రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా తాడేపల్లిగూడెం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994-1999 మధ్య టీడీపీ తరుఫున రాజ్యసభ సభ్యుడిగా నారాయణ స్వామి పని చేశారు. ప్రస్తుత టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి చిన్నాన్నే యర్రా నారాయణ స్వామి. నారాయణస్వామి మృతికి టీడీపీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.