రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ రోజు ఒక పార్టీలో ఉన్న వారు కొన్నాళ్లకు మరో పార్టీలో కనిపిస్తారు. రాజకీయ నేతలు పార్టీలు మారడం ఆశ్చర్యం కాదు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం 39 రోజుల్లోనే మూడు పార్టీలు మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం..
పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరగోవింద్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ 39 రోజుల్లో మూడు సార్లు పార్టీలు మారాడు. గతంలో బీజేపీ నుంచి విడిపోయిన తర్వాత బల్వీందర్ సింగ్ గత నెల జనవరి 3న కాంగ్రెస్ లో చేరారు. కేవలం 39 రోజుల వ్యవధిలోనే బల్వీందర్ సింగ్ లడ్డీ కాంగ్రెస్ ను వీడి తిరిగి బీజేపీలోకి వచ్చారు. బటాలాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ లడ్డీని బీజేపీలోకి తిరిగి ఆహ్వానించారు. బటాలా బీజేపీ అభ్యర్థి ఫతేజాంగ్ బజ్వా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Balwinder Singh Laddi, MLA of Hargovindpur in Punjab rejoined BJP in presence of party general secretary Tarun Chug
Laddi who won the election on a Congress ticket joined BJP on Dec 28. Then he went back to Congress on Jan 3 and again joined BJP on Feb 11 #PunjabElections pic.twitter.com/otsZUA7Ku0
— ANI (@ANI) February 12, 2022
గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత పర్తాప్ సింగ్ బజ్వా తమ్ముడు అయిన బజ్వాతో పాటు లడ్డీ డిసెంబరు 28న దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన 6 రోజులకే లడ్డీ ఆ పార్టీ మారి కాంగ్రెస్ లోకి చేరారు. పంజాబ్ వ్యవహారాల AICC ఇన్ ఛార్జ్ హరీష్ చౌదరి, సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ సమక్షంలో బల్వీందర్ సింగ్ కాంగ్రెస్ లో చేరారు. గురుదాస్ పూర్ జిల్లాలోని హరగోవింద్ పూర్ అసెంబ్లీ స్థానం టిక్కెట్ ను లడ్డీకి కాంగ్రెస్ నిరాకరించింది. లడ్డీ స్థానంలో మన్ దీప్ సింగ్ ను కాంగ్రెస్ నామినేట్ చేసింది. అసంతృప్తితో ఉన్న లడ్డీ.. పార్టీలో చేసేది ఏమిలేక మళ్లీ బీజేపీ లోకి చేరారు. ఇలా రోజుకో పార్టీ మారే నాయకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.