తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీజేపీకి గట్టి సవాల్ విసిరారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ కూడా సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: ఓటములు, అవమానాలు, కన్నీళ్లు దాటి.. నేడు మంత్రిగా!
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల దగ్గరకు ఈడీ, సీబీఐ వెళ్లదా? అంటూ ప్రశ్నించారు. ఇక ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారని మీకు దమ్ముంటే ఆ పని చేయాలని తెలిపారు. ఇక సీఎం కేసీఆర్ విసిరిన సవాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.