ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రాజకీయాలు రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిదువుగా మారాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వీడగా.. అదే బాటలో రెబల్ బావుటా ఎగరేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. దాంతో నెల్లూరు లో వైసీపీ పార్టీలో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత తాజాగా ఈ వివాదంపై స్పందించారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు హోం మంత్రి తానేటి వనిత. వైసీపీని వదిలి వెళ్లిన నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఏపీలో నెల్లూరు రాజకీయం నడుస్తోంది. ఒక్కొక్కరు వైసీపీ పార్టీని వీడుతున్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీని వీడిన నాయకులు ఎందుకు వెళ్లారో తాజాగా చెప్పుకొచ్చారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై, అభివృద్దిపై పలు ఆసక్తికర అంశాలను చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. “నేను ఏదీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు. నాకు ఇది కావాలి, అది కావాలి అని నేను కోరుకోలేదు. అయితే అందరు ఒకేలా ఆలోచించరు. ముఖ్యంగా పురుష రాజకీయ నాయకుల్లో కోరికలు ఎక్కువ. నాకు మంత్రి పదవి కావాలి, ఈ పదవి కావాలి, చక్రం తిప్పాలి అనే ఆశలు ఉంటాయి. అవి నెరవేరకపోవడంతోనే వారు ఈ విధంగా పార్టీని వీడారు” అని హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. మరి నెల్లూరు రాజకీయ పరిస్థితులపై హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.