పలకరింపులు కరువయ్యాయి. యోగ, క్షేమాలు అడిగే నాధుడు లేడు. ఇరుగింట్లో, పొరిగింట్లో ఎవ్వరూ ఉంటున్నారో కూడా తెలియని సమాజంలో బతికేస్తున్నాం. అంత వరకు ఎందుకు ఒకే ఇంట్లో ఉంటున్నా పిల్లలు, తల్లిదండ్రుల్ని పట్టించుకోని రోజులకు వచ్చేశాం.
ఈ రోజుల్లో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలకరింపులు కరువయ్యాయి. యోగ, క్షేమాలు అడిగే నాధుడు లేడు. ఇరుగింట్లో, పొరిగింట్లో ఎవ్వరూ ఉంటున్నారో కూడా తెలియని సమాజంలో బతికేస్తున్నాం. అంత వరకు ఎందుకు ఒకే ఇంట్లో ఉంటున్నా పిల్లలు, తల్లిదండ్రుల్ని పట్టించుకోని రోజులకు వచ్చేశాం. వారిని ఆప్యాయతతో పలకించే రోజులు పోయాయి. వారికి సేవ చేసుకోలేక వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు పిల్లలు. ఇలాంటి ఈ రోజుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు ఈ దంపతులు. తమ మనిషి కాని పని మనిషి కోసం వీరు చేసిన ఓపని ఇప్పుడు చర్చించుకునేలా చేసింది. ఇంతకు వాళ్లేమీ చేశారంటే.
నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు తమ ఇంట్లో పనిచేసే పనిమనిషిని చనిపోయింది. ఆమెను తమ మనిషిగా భావించి..దగ్గరుండి అంత్యక్రియలు చేశారు. 30 ఏళ్ల క్రితం లక్షమ్మ అనే గిరిజన మహిళ.. పనికోసం అల్లూరు నివాసి అయిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చింది. పనిమనిషి అయిన ఆమెను సొంత మనిషిలాగే చూసింది ఆ కుటుంబం. ఆమెకు నా అనేవారు ఎవ్వరూ లేకపోవడంతో ఏ లోటు లేకుండా ఆ కుటుంబమే చూసుకుంది. ఈ సోమవారం అనారోగ్య సమస్యలతో లక్షమ్మ చనిపోయింది. ఆమె చనిపోవడంతో విష్ణువర్థన్ రెడ్డి కుటుంబం కన్నీటి పర్యంతం అయ్యింది. సొంత కుటుంబ సభ్యురాలే కోల్పోయిందన్న బాధను వెలిబుచ్చారు.
హైదరాబాద్‌లో ఉన్న విష్ణువర్థన్ రెడ్డి దంపతులు.. ఆమె చనిపోయిందన్న వార్త వినగానే హుటాహూటిన అల్లూరుకు చేరుకున్నారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సతీమణి కాటంరెడ్డి శివప్రియమ్మ తన స్వహస్తాలతో లక్షమ్మకి పసుపు రాసి, అంతిమ సంస్కారాలను నిర్వహించారు. స్వయంగా ఆ కుటుంబం.. లక్షమ్మ చివరి మజిలీని నిర్వహించారు. అనంతరం ఆమె పెద్ద కర్మను జరిపించి.. భోజనాలు ఏర్పాట్లు చేశారు. మానవత్వం కరువౌతున్న ఈ రోజుల్లో పనిమనిషిని సొంత మనిషిలా చూసుకుని, ఆమె అంత్యక్రియలు చేయడం పట్ల విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.