నటి దివ్యవాణి..టీడీపీ ముఖ్యనేతల్లో ఒకరు. నిత్యం అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తు వార్తలో నిలుస్తుంటారు. కొంతకాలంగా టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్న దివ్యవాణి.. పార్టీ తరపున తన వాయిస్ ను బలంగా వినిపిస్తుంటారు. మహానాడుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమాల్లో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలు లో జరిగిన మహనాడు కార్యక్రమంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె అవమానంగా ఫీలైనట్లు టాక్ వినిపించింది. ఈక్రమంలో తాజాగా టీడీపీకి దివ్యావాణి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దివ్యవాణి రాజీనామా విషయం సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.