నందమూరి తారకరత్న మరణించారు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన.. 23 రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. అయితే తారకరత్న మరణానికి కారణం వాళ్లేనంటూ ఓ టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ చేశారు.
నందమూరి తారకరత్న హఠాన్మరణం. 39 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పాదయాత్ర సందర్భంగా కుప్పకూలిన తారకరత్న.. తిరిగి లేవలేదు. తాజాగా ఆయన భౌతిక కాయాన్ని బెంగళూరు హాస్పిటల్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు వరకు ప్రతి ఒక్కరూ తారకరత్న మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇలా అందరూ బాధలో ఉంటే ఓ తెలుగుదేశం నేత మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్స్ మధ్య చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. ఇందులో తారకరత్న పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి నడుస్తుండగా.. ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడి వైద్యులు ఆయనకు సీపీఆర్ చేశారు. కుడి, ఎడమ రక్తనాళాల్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే పాదయాత్ర రోజు జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్న టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. వాళ్ల నిర్లక్ష్యం కారణంగానే తారకరత్న చనిపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర రోజు ట్రాఫిక్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గుండెపోటు వచ్చిన తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి 45 నిమిషాలు పట్టిందని, పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సుధీర్ రెడ్డి ఆరోపించారు.
తారకరత్న విషయానికొస్తే డాక్టర్స్ సూచన మేరకు జనవరి 27 రాత్రి కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు. జనవరి 28 తెల్లవారుజామున 2 నుంచి చికిత్స ప్రారంభించారు. అదే రోజు యాంజియోప్లాస్టీ చేశారు. జనవరి 29న మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. జనవరి 30న వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. జనవరి 31న తారకరత్న హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటోలు కొన్ని బయటకొచ్చాయి. ఫిబ్రవరి 1న 10 మంది డాక్టర్స్ టీమ్.. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. ఫిబ్రవరి 2న తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఫిబ్రవరి 16న మరోసారి బ్రెయిన్ స్కాన్ చేశారు. అదే టైంలో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని కూడా కుటుంబసభ్యులు భావించారు. కానీ ఫిబ్రవరి 18న తారకరత్న తుదిశ్వాస విడిచారు. దీంతో ప్రతిఒక్కరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే తారకరత్న మరణానికి పోలీసులే కారణమంటూ టీడీపీ నేత సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.