గత కొన్నిరోజుల నుంచి మృత్యువుతో పోరాడిన తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ టైంలో ఆయన చివరి పొలిటికల్ స్పీచ్ వైరల్ గా మారింది.
నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. దాదాపు 23 రోజుల నుంచి బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. శివరాత్రి రోజు శివైక్యం అయ్యారు. తారకరత్న అకాల మరణం ప్రతి ఒక్కరిని బాధిస్తోంది. ఎంచక్కా ఓవైపు సినిమాలు చేసుకుంటూ, మరోవైపు రాజకీయాల్లోనూ చురుగ్గా మారేందుకు రెడీ అయిన వ్యక్తి.. ఇలా అకస్మాత్తుగా తనువు చాలించడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో తారకరత్న చివర పొలిటికల్ స్పీచ్ వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. నందమూరి ఫ్యామిలీలో గడిచిన కొన్నేళ్ల కాలంలో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. హరికృష్ణ, జానకిరామ్, ఉమామహేశ్వరి ఇప్పుడు తారకరత్న.. ఇలా ఒకరితర్వాత ఒకరు అనారోగ్య సమస్యలు, అనుకోని రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఈ క్రమంలోనే ఆయా వ్యక్తుల చివరి వీడియోలు వైరల్ అయ్యాయి. అలా తారకరత్న చివరి స్పీచ్ వీడియో వైరల్ గా మారింది. జనవరిలో లోకేష్ పాదయాత్రకు ముందు టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మీటింగ్ లో తారకరత్న మాట్లాడారు. ఇప్పుడు ఈ పొలిటికల్ స్పీచే అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు.
‘రాష్ట్రంలో ప్రత్యర్థులు తనకు పోటీకాదని ఎన్టీఆర్.. డైరెక్ట్ గా కేంద్రంతో తలపడ్డారు. దశాబ్దాల పాటు ఏ ముఖ్యమంత్రి చేయని, చేయలేని సంస్కరణలు కేవలం ఏడేళ్లలో చేసి చూపించారు. మహిళలకు ఆస్తుల్లో హక్కు, తాలుకాలు రద్దు చేసి మండల వ్యవస్థని, బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారు. తెలుగుదేశం మార్చిన భారతదేశంలో మనం ఇప్పుడున్నాం. 1982లో ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో వేసిన పునాది.. ఇప్పుడు పేద ప్రజలకు పెద్ద భవంతి. రైతన్న గుండెల్లో ఎన్టీఆర్ రామన్నగా నిలిచిపోయారు. మద్యపాన నిషేధం లాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు.’
‘ఈరోజు ఎన్టీఆర్ కలలుగన్న ఆంధ్రరాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మన భావితరాల వారు సుఖంగా బ్రతకాలన్నా, ఆ రామరాజ్యాన్ని తీసుకురావాలన్నా చంద్రబాబుగారిని ముఖ్యమంత్రి చేయాలి. ఈ రోజు నుంచి నా అడుగు జనాలవైపు, నా చూపు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి వైపు ఉంటుంది. ఆ మహానుభావుడికి మనవడిగా, బాలయ్య బాబుకి అబ్బాయిగా, చంద్రబాబు మామయ్యకు మేనల్లుడిగా, మీ అశీర్వాదాలే శ్రీరామరక్షగా అడుగేస్తున్నా. సూర్యుడైనా, చంద్రుడైనా, ఇంద్రుడైనా అంతా మా బాలయ్య బాబాయే’ అని తారకరత్న ఈ స్పీచ్ లో చెప్పుకొచ్చారు. మరి తారకరత్న చివరి స్పీచ్ మీకెలా అనిపించింది. కింద కామెంట్ చేయండి.