మరో వారంపోతే సంక్రాంతి పండగ.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అయిపోయారు. మరోవైపు తమిళ స్టార్స్ విజయ్, అజిత్ కూడా తమ కొత్త సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేయాలని చూస్తున్నారు. ఇలా ఓవైపు అంతా హడావుడిగా ఉంది. అదే టైంలో ఓటీటీలోనూ ఈ వీకెండ్ కు కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోయాయి. పండగ సరదాని వారం ముందే మీకు తీసుకొచ్చే ప్లాన్ చేశాయి. ఈ క్రమంలోనే రేపు రిలీజ్ కాబోతున్న సినిమాలు/ వెబ్ సిరీసుల జాబితా తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలానే ఈ శుక్రవారం కూడా చాలా కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయిపోయాయి. కానీ ఇందులో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది మాత్రం ‘అన్ స్టాపబుల్ 2’లో ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 2 కోసమే. గత వారం విడుదలైన ఫస్ట్ పార్ట్.. ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంది. ఈ వారం రిలీజ్ కాబోయే ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. అలానే ‘హిట్ 2’ కూడా రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని తెలుగు డబ్బింగ్ సినిమాలు కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.