ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కి సిద్ధమయ్యాయి. మిమ్మల్ని నవ్వించి, కవ్వించి, భయపెట్టి, థ్రిల్ చేసేందుకు రెడీ అయిపోయాయి. ఆయా సినిమాలు, వెబ్ సిరీసుల ట్రైలర్స్, టీజర్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో సందడి చేస్తుండగా, అవి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. వీటిలో పలు తెలుగు చిత్రాలతో పాటు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఇంగ్లీష్ వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. మరి అవెంటో చూసేద్దామా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. కరోనా మన లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. ఏ సినిమా థియేటర్ లో చూడాలి. ఏ సినిమా ఓటీటీలో చూడాలి అనే దాంట్లో ప్రేక్షకులు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. మరోవైపు బిగ్ స్క్రీన్ పై చూసినా సరే మళ్లీ చూసేందుకు రెడీ అయిపోతున్నారు. అలా ఈసారి మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, కార్తి ‘సర్దార్’ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాయి. వీటితో పాటు సుడిగాలి సుధీర్ ‘గాలోడు’, మసూద, అజయ్ దేవ్ గణ్ ‘దృశ్యం 2’ సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానున్నాయి.