ఇండస్ట్రీలో దాదాపు చాలామంది డైరెక్టర్లు ఆడియన్స్ పల్స్ తెలుసుకొని తమ సినిమాలో కమర్షియల్ ఎలెమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. కానీ.. కొంతమంది దర్శకులు మాత్రం తాము నమ్మిన కథతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా.. వారి సినిమాలకు మంచి ఆదరణ అయితే లభిస్తుంది. ఈ లిస్టులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు డైరెక్టర్ హను రాఘవపూడి.
సినీ ఇండస్ట్రీలో దాదాపు చాలామంది డైరెక్టర్లు ఆడియన్స్ పల్స్ తెలుసుకొని తమ సినిమాలో కమర్షియల్ ఎలెమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. కానీ.. కొంతమంది దర్శకులు మాత్రం తాము నమ్మిన కథతోనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫలితం ఎలా ఉన్నా.. వారి సినిమాలకు మంచి ఆదరణ అయితే లభిస్తుంది. ఈ లిస్టులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు తీసింది తక్కువ సినిమాలే. అయినా.. ప్రతి సినిమాలో తనదైన మార్క్ చూపిస్తూ వచ్చాడు. గతేడాది “సీతారామం” సినిమాతో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్టు కొట్టాడు.
దీంతో హను రాఘవపూడి తదుపరి సినిమా ఏ హీరోతో చేయనున్నాడు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎలాగో హిట్ ట్రాక్ లో పడ్డాడు కాబట్టి.. స్టార్ హీరోలు ఇతని కోసం క్యూ కడుతున్నారని టాక్. ఈ నేపథ్యంలో.. తన తరువాత సినిమాని కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో చేయబోతున్నాడని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. హను తెరకెక్కించిన “సీతా రామం” సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన ఈ చిత్రం.. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు హను రాఘవపూడి.
ఇంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డైరెక్టర్ బాధ్యత మరింత పెరగనుంది. దీంతో తన తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. హను రాఘవపూడి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎంతవరకు నిజముందో పక్కనే పెడితే.. సూర్యతో సినిమా అంటే హను రాఘవపూడి గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం ఖాయం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ వారు నిర్మించనున్నారని సమాచారం. అయితే.. సూర్యకు చెప్పిన కథనే.. ఇంతకుముందు హీరోలు నాని, రామ్ చరణ్ లకు చెప్పాడట. కానీ.. వారితో వర్కౌట్ అవ్వలేదని సూర్యకు కథ చెప్పి మెప్పించినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సూర్యతో హను సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రాబోతుందని టాక్. మరి ఈ కాంబినేషన్ లో సినిమా నిజంగానే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Buzz:
Suriya to play lead role in #SitaRamam Dir Hanu Raghavapudi’s next, Pan India film.
— Christopher Kanagaraj (@Chrissuccess) March 4, 2023