అతడు స్టార్ హీరో. దాదాపు 58 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఆరుగులు పిల్లలుండగా.. తాజాగా మరో పిల్లాడికి అతడి భార్య జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ స్టార్ హీరో ముసలోడే కానీ మహానుభావుడు! చాలా సినిమాలు చేశాడు. స్టిల్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. యాక్టర్ గా ఇతడిని
వంక పెట్టడానికి ఏం లేదు. ఎందుకంటే గతంలో ఆస్కార్ కూడా గెలుచుకున్నాడు. సరే ఇదంతా ఓకే. ఇప్పుడెందుకు ఇతడి గురించి చెబుతున్నావ్ అంటే.. అక్కడికే వచ్చేస్తున్నా. 80 ఏళ్ల వయసులో ఏకంగా ఏడోసారి తండ్రయ్యాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరో? ఏంటి విషయం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆలోవర్ గ్యాంగ్ స్టర్ అయితే హాలీవుడ్ లో అప్పట్లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో లీడ్ రోల్ చేసిన రాబర్ట్ డీ నరో.. ప్రస్తుతం ‘ఎబౌట్ మై ఫాదర్’ మూవీ చేశారు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఇతడి తండ్రి-పిల్లల గురించి మాట్లాడాడు. యాంకర్ మీకు ఆరుగురు పిల్లలు కదా అని చెప్పగా.. ‘ఆరు కాదు ఏడుగురు’ అని రాబర్ట్ కరెక్ట్ చేశాడు. రీసెంట్ గానే ఏడోసారి తండ్రి అయినట్లు, తనకు కొడుకు పుట్టినట్లు చెప్పుకొచ్చాడు. అంతకు మించి డీటైల్స్ ఏం బయటపెట్టలేదు.
హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నరో.. 1976లో ఫస్ట్ డయానా అబాట్ ని పెళ్లి చేసుకున్నాడు. 1988 వరకు ఈమెతో కాపురం చేశాడు. దానికి గుర్తుగా కూతురు డ్రేనా(51), కొడుకు రాఫెల్ (46) పుట్టారు. 1995లో మోడల్-నటి అయిన టౌకీ స్మిత్ తో రిలేషన్ షిప్ మెంటైన్ చేశాడు. దీంతో జూలియన్,ఆరోన్ అనే కవలలు పుట్టారు. 1997లో గ్రేస్ హై టవర్ ని రాబర్ట్ పెళ్లి చేసుకున్నాడు. ఈమెకి కొడుకు ఇల్లియట్ (24), కూతురు హెలెన్ గ్రేస్(11) ఉన్నారు. ఇప్పుడు మరో కొడుకు పుట్టాడు. సో అదనమాట విషయం. మరి ఈ స్టార్ హీరో దాదాపు 80 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రి కావడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
Congratulations are in order as #RobertDeNiro welcomed his 7th child at 79. pic.twitter.com/BkFIPbC4VZ
— Filmfare (@filmfare) May 10, 2023