ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసినా.. వాళ్ళ కెరీర్ ని మలుపు తిప్పి, గుర్తింపు తీసుకొచ్చే సినిమా ఏదొక టైంలో ఖచ్చితంగా వస్తుంది. అలాంటి సినిమాలు రావాలంటే.. రెగ్యులర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ.. ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. హార్డ్ వర్క్ తో కష్టపడితే అవకాశాలు వస్తాయి.. ఆ అవకాశాలు కూడా ఆచితూచి కెరీర్ కు ఉపయోగపడే విధంగా ఎంచుకుంటే.. కెరీర్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప.. పూర్తిగా డబ్బు కోసం సినిమాలు చేసే రకం కాదు.. అలాగని మంచి కథలను వదులుకునే రకం కూడా కాదు.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసినా.. వాళ్ళ కెరీర్ ని మలుపు తిప్పి, గుర్తింపు తీసుకొచ్చే సినిమా ఏదొక టైంలో ఖచ్చితంగా వస్తుంది. అలాంటి సినిమాలు రావాలంటే.. రెగ్యులర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ.. ఓపికగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. హార్డ్ వర్క్ తో కష్టపడితే అవకాశాలు వస్తాయి.. ఆ అవకాశాలు కూడా ఆచితూచి కెరీర్ కు ఉపయోగపడే విధంగా ఎంచుకుంటే.. కెరీర్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే.. కెరీర్ ని ఓపికగా బిల్డ్ చేసుకునేవారు తక్కువమంది ఉంటారు. దాదాపు అందరూ అవకాశాలు వస్తున్నాయని సినిమా కథలను సరిగ్గా వినకుండా.. రెమ్యూనరేషన్ కోసం రెచ్చిపోతుంటారు.
మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప.. పూర్తిగా డబ్బు కోసం సినిమాలు చేసే రకం కాదు.. అలాగని మంచి కథలను వదులుకునే రకం కూడా కాదు. ఓవైపు సెలెక్టెడ్ గా వెళ్తూనే.. మరోవైపు గ్లామర్ టచ్ ఉన్న రోల్స్ కూడా చేస్తోంది అమ్మడు. అయితే.. తెలుగులో ఇప్పటిదాకా ఒకే ఒక్క సినిమా చేసిందని మాత్రం చెప్పగలను. ఆ ఒక్క సినిమానే ఇన్నాళ్ల కెరీర్ గ్రాఫ్ ని ఒక్కసారి రెట్టింపు చేయడమే కాకుండా.. తెలుగులోను మంచి ఆదరణ, నటిగా తగిన గుర్తింపు తీసుకొచ్చింది. ఎవరో గుర్తొచ్చిందా? ఇంకా క్లూస్ కావాలా.. సరే ఇంకో క్లూ ఇస్తా! ఈ భామ తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా.. అది కూడా లవ్ స్టోరీ చేసింది. అదికూడా విడుదలైన అన్ని భాషలలో సూపర్ హిట్ అవ్వడం విశేషం.
ఈ లెక్కన ఒకే ఒక్క సినిమాతో సౌత్ మొత్తం క్రేజ్ సంపాదించుకుందని చెప్పవచ్చు. అయితే.. ఇటీవలే తెలుగులో సెకండ్ మూవీ కూడా సైన్ చేసింది. ఈసారి టాలీవుడ్ సెల్ఫ్ మేడ్ స్టార్ సరసన చేస్తోంది. సో.. ఇప్పటికీ అమ్మడు ఎవరో గుర్తొచ్చి ఉండాలి. ఎవరో చెప్పమంటారా? మృణాల్ ఠాకూర్. సీతారామం మూవీతో తెలుగు డెబ్యూ చేసిన ఈ ముంబై భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. వెరసి.. తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుందంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది కాబట్టి.. హిందీ సినిమాలు చేసేటప్పుడు గ్లామర్ టచ్ ని వదలట్లేదు. అలాగే సౌత్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఉండాల్సిన విధంగా ఉంటోంది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి సీతారామం సీత చిన్నప్పుడు ఎలా ఉందో.. ఆమెను చూడగానే మీలో కలిగిన భావాలను కామెంట్స్ లో తెలియజేయండి.