ఆ వ్యక్తి ఏకంగా 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకుర్ కు ప్రపోజ్ చేశాడు. మరి ఆమె ఎలా రెస్పాండ్ అయిందో తెలుసా? ఇంకెందుకు లేటు ఈ ఆర్టికల్ చదివేయండి.
సినీ సెలబ్రిటీలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. హీరోకి ఫాలోయింగ్ పెరగాలంటే కష్టమేమో కానీ హీరోయిన్స్ చాలా తక్కువ టైంలోనే పాపులారిటీ సంపాదిస్తారు. ఒకటి రెండు సినిమాలతోనే ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారుతూ ఉంటారు. వీరి ఫాలోయింగ్ వల్ల ప్లస్సులు ఉన్నట్లే కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు అభిమానులు చేసే పనికి ఏం చేయలో అర్థం కానీ పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విషయంలోనూ సేమ్ అలాంటిదే జరిగింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ అనగానే ‘సీతారామం’ సినిమానే గుర్తుకొస్తుంది. ఈ చిత్రంలో తన అందం, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగు యువతను కట్టిపడేసింది ఈ బ్యూటీ. తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో అభిమానుల నుంచి చాలా ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా పెళ్లి చేసుకుంటావా అని ఆమెని డైరెక్ట్ గా అడిగేశాడు. ఇది కాస్త ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నా తరపునుంచి సంబంధం ఖరారైంది. మరి మీ సైడ్ నుంచి ఓకేనా?’ అని మృణాల్ ని అడిగాడు. దీనిపై స్పందించిన మృణాల్.. ‘నా తరపు నుంచి వద్దు అనుకుంటున్నాను’ అంటూ తనదైన శైలిలో కాస్త కామెంట్ పెట్టింది.
ఇక అభిమాని ప్రపోజ్ చేయడం, దానికి అంతే స్మూత్ గా మృణాల్ కౌంటర్ ఇచ్చేసరికి చాలామంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కామన్ మ్యాన్ కి దక్కే మహారాణి ఆమె కాదు అని ఒకరు కామెంట్ పెట్టగా, అభిమానిని హర్ట్ చేశావంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా ‘సెల్ఫీ’ మూవీలో ఓ సాంగ్ చేసిన మృణాలు.. ఇషాన్ కట్టర్ తో ఓ సినిమా, ఆదిత్య కపూర్ తో మరో మూవీ చేస్తూ బిజీగా ఉంది. ఇవి కాకుండా నాని 30వ సినిమాలోనూ ఈమెనే హీరోయిన్. మరి ‘సీతారామం’ బ్యూటీకి అభిమాని పెళ్లి ప్రపోజల్ పెట్టడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.