ఓ సినిమా థియేటర్లలోకి వచ్చిదంటే.. చాలామంది ఏ షోకి వెళ్దామా అని ప్లాన్ చేస్తారు. మరికొందరు మాత్రం.. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలో వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు చాలావరకు అలానే జరుగుతోంది. ఎందుకంటే లాక్ డౌన్ తర్వాత ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయింది. గతంతో పోలిస్తే కొన్ని సినిమాలు కాస్త లేటుగా స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ట్వీట్ కూడా చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టైమ్ ట్రావెల్ సినిమాలు మనకు కొత్తేం కాదు. ‘ఆదిత్య 369’ మన కాలగమనంలోకి వెళ్లిపోయాం. సినిమా చూస్తూ చిన్నపిల్లాడిలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కాలంలో ఈ జానర్ లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రాలేదు. గత రెండు మూడేళ్లలో మాత్రం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కి డిఫరెంట్ జానర్స్ మిక్స్ చేసి సినిమాలు తీస్తున్నారు. అలా ఈ కాన్సెప్ట్ కి అమ్మ సెంటిమెంట్ యాడ్ చేసిన తీసిన సినిమా ‘ఒకేఒక జీవితం’. తెలుగు, తమిళంలో ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలోనూ అంతే ఆదరణ దక్కించుకునే అవకాశముంది.
ఇకపోతే ఈ సినిమా.. సోనీలివ్ ఓటీటీలో అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదేవిషయాన్ని సదరు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ‘జీవితం రెండో అవకాశం ఇస్తే విధిరాతను మార్చుకోగలమా? శర్వానంద్, రీతూవర్మ, అమల కలయికలో వచ్చిన ఒకేఒక జీవితం మూవీ ఈ నెల 20 నంచి మీ సోనీలివ్ ఇంటర్నేషనల్ లో’ అని రాసుకొచ్చింది. ఈ చిత్రంలో.. ముగ్గురు యువకులు జీవితాల్ని ఎమోషన్స్, కామెడీ మిక్స్ చేసి తీశారు. సైన్స్ గొప్పదే కానీ గతాన్ని మర్చగలిగే శక్తి దానికి లేదనే సందేశాన్ని ఇందులో చాలా చక్కగా అందరికీ అర్ధమయ్యేలా చూపించారు. మరి మీలో ఎంతమంది ‘ఒకేఒక జీవితం’ ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
జీవితం రెండో అవకాశం ఇస్తే విధి రాతను మార్చుకోగలమా?
శర్వానంద్, రీతు వర్మ, అమల కలయికలో వచ్చిన “ఒకే ఒక జీవితం” ఈ నెల 20 నుండి మీ సోనీ LIV International లో#OkeOkaJeevithamOnSonyLIV #SonyLIVInternational #OkeOkaJeevitham pic.twitter.com/QMQPpxiCJq— SonyLIV International (@SonyLIVIntl) October 10, 2022