శర్వానంద్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇవాళ అంగరంగ వైభవంగా హల్దీ వేడుక జరిగింది.
పెళ్లి అనేది అద్భుతమైన అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సంక్రాంతి పండుగలా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ జరిపిస్తారు. భారతీయ సంప్రదాయంలో పెళ్లిని ఘనంగా నిర్వహిస్తారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ తమకున్నంతలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు చేసుకుంటారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వివాహ వేడుక కూడా అలానే జరుగుతుంది. శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్ కి శుభం కార్డు వేసేయనున్నారు. ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ఆయన హస్బెండ్స్ క్లబ్ లో చేరిపోతున్నారు. ఒక ఇంటి వాడు అయిపోవడానికి ఎంతో సమయం లేదు. శర్వానంద్, రక్షిత రెడ్డి జూన్ 3న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏడడుగుల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒకటవ్వబోతున్నారు.
జైపూర్ ప్యాలెస్ లోని కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శర్వానంద్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. జైపూర్ లోని ప్రసిద్ధి చెందిన లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లి సందడి షురూ అయ్యింది. ప్రముఖుల వివాహ వేడుకలకు పెట్టింది పేరు లీలా ప్యాలెస్. వివాహ వేడుక నేపథ్యంలో హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఓ శుభ ముహూర్తాన హల్దీ వేడుకలు జరిగాయి. వధూవరుల ఇరువురి కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు. శర్వానంద్ ముఖానికి పసుపు రాయగా.. శర్వానంద్ కూడా కుటుంబ సభ్యుల ముఖాలకు పసుపు రాస్తూ సందడి చేశారు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లో కాసేపు సందడి చేశారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శర్వానంద్, రక్షిత రెడ్డి జనవరి నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, రానా వంటి పలువురు ప్రముఖుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. వీరిది ప్రేమ వివాహం చేసుకోబుతున్నారు. రక్షిత రెడ్డి ఏపీకి చెందిన పొలిటికల్ ఫ్యామిలీలో పెరిగారు. ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్. ఈమె తాతయ్య బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రముఖ రాజకీయ నేత. ఇక శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.
శర్వా పెళ్లి సందడి ❤️
Lovely & candid visuals from Hero @ImSharwanand ‘s Haldi 💛Ceremony in Jaipur 😍 #Sharwanand𓃵 #SharwAnand #Sharwa35 #Sharwa #haldifunction #marriage #ramcharan #prabhas #weddingvibes #Jaipur#SharwanandMarriage 🥰 ❤️ pic.twitter.com/nV0Kpbyise
— SharwAnand ✨️ (@SharwaFans) June 2, 2023