హీరో శర్వానంద్ పెళ్లి శనివారం రాత్రి 11 సమయంలో జరిగింది. ఆయన ఏపీకి చెందిన రక్షిత రెడ్డి మెడలో మూడుముళ్లు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ప్రముఖ టాలీవుడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఏపీకి చెందిన రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం శర్వానంద్, రక్షిత రెడ్డిల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, శుక్రవారం జరిగిన సంగీత్ వేడుకలో శర్వా దంపతులు రచ్చ రచ్చ చేశారు. చిరంజీవి ‘పూనకాలు లోడింగ్’ పాటకు జంటగా స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ సంగీత్ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.
కాగా, రక్షిత రెడ్డి ఏపీకి చెందిన రాజకీయ బ్యాగ్రౌండ్ ఉన్న ఇంటి నుంచి వచ్చారు. ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్‌గా ఉన్నారు. తాతయ్య బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రముఖ రాజకీయ నేత. శర్వానంద్, రక్షితరెడ్డి జంట గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ తమ ప్రేమ విషయం రెండు కుటుంబాల పెద్దలకు పెళ్లికి ఒప్పించారు. గత జనవరి నెలలో శర్వానంద్, రక్షిత రెడ్డిల నిశ్చితార్థం జరిగింది. ఆరు నెలల తర్వాత జూన్ 3న ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన శర్వా పెళ్లి ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hearty Congratulations to our dearest @ImSharwanand anna on his wedding with #Rakshita ❤️
May this beginning of a beautiful journey be filled with love, joy, and companionship 🤗
We wholeheartedly wish you both a lifetime of love, laughter, and togetherness 🤩#Sharwanand… pic.twitter.com/9Bn0pcgzH9
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 4, 2023
Heartfelt congratulations to @ImSharwanand and #Rakshita on your wedding ❤️
May your journey be filled with an everlasting love and endless happiness 🤩#Sharwanand #SharwaRakshita #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/VsbxB0ijm8
— Shreyas Media (@shreyasgroup) June 4, 2023
Hearty Congratulations to @ImSharwanand and #Rakshitareddy ❤️
May this beginning of a beautiful journey be filled with love, joy, and companionship 🤗 #Sharwanand𓃵 #SharwAnand #Sharwa #sharwa35 #ramcharan #Prabhas #Siddharth#SharwanandMarriage ❤️#SharwanandWedding ✨️ pic.twitter.com/TCcTB2syER
— SharwAnand ✨️ (@SharwaFans) June 4, 2023
A glimpse of the groom & bride ✨ @ImSharwanand #Sharwanand #SharwanandWedding #RakshitaReddy #Tollywood #TollywoodActor pic.twitter.com/QDEmy95NLA
— Hyderabad Times (@HydTimes) June 3, 2023