హీరో శర్వానంద్ మరికొన్ని గంటల్లో రక్షిత మెడలో తాళి కట్టబోతున్నారు. జైపూర్‌లోని ఓ ప్యాలెస్ వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. ప్రస్తుతం వీరి సంగీత్‌కు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరికొన్ని గంటల్లో హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడు కానున్నారు. మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన.. రాజకీయ నేపథ్యం ఉన్న రక్షిత రెడ్డిని శర్వా పెళ్లాడబోతున్నారు. గత జనవరి నెలలో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. శనివారం జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక జరుగుతోంది. నిన్న హల్దీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ, సినీ ప్రముఖులు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంగీత్ వేడుక సందర్భంగా శర్వానంద్, రక్షితలు డ్యాన్స్‌తో అదరగొట్టారు. మెగాస్టార్ చిరంజీవి తాజా హిట్టు చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని పాటకు వీరిద్దరూ డ్యాన్స్ చేశారు.
‘‘ డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’’ అంటూ స్టెప్పులేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఉన్నారు. రామ్ చరణ్, శర్వానంద్ చిన్నప్పటినుంచి మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఇక, శర్వానంద్ పెళ్లాడబోయే అమ్మాయి వివరాల విషయానికి వస్తే.. రక్షిత రెడ్డి ఏపీకి చెందిన పొలిటికల్ ఫ్యామిలీలో పెరిగారు.
ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్. ఈమె తాతయ్య బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ప్రముఖ రాజకీయ నేత. శర్వానంద్, రక్షితరెడ్డిలు గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. రెండు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోవటంతో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. మరి, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన శర్వానంద్, రక్షిత రెడ్డిల ‘పూనకాలు లోడింగ్’ డ్యాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Don’t Stop Dancing, Poonakalu Loading. Mega Wedding with All Boss Banisa’s at One Place 🔥pic.twitter.com/STXHyHDx03
— Raees (@RaeesHere_) June 2, 2023