సినిమాలు చూసే విషయంలో ప్రేక్షకుల ఆలోచన చాలా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే.. పెద్ద సినిమాల కోసం తప్పించి థియేటర్లకు వెళ్లే వారి చాలా తగ్గిపోయింది. అందుకే కారణం ఓటీటీలు. బిగ్ స్క్రీన్ పై చూడటం చాలామంచి అనుభూతి. కానీ చాలా ఖర్చు పెట్టాలి. అందుకే ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమా ఏది వస్తుందా అని నెటిజన్స్ ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసమే నాగ్ ‘ద ఘోస్ట్’ సిద్ధమైపోయింది. అందుకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కింగ్ నాగార్జునకి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువే. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేయాలంటే దర్శకులకు గుర్తొచ్చేది ఆయనే. గతేడాది ‘వైల్డ్ డాగ్’ మూవీతో ఎంటర్ టైన్ చేశారు. దాదాపు ఇదే తరహా జానర్ లో ఈ దసరాకు ‘ద ఘోస్ట్’ అని పలకరించారు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. యాక్షన్ సినిమాలు చూసేవాళ్లని మాత్రం బాగా ఎంటర్ టైన్ చేసింది. 60 ఏళ్ల వయసులోనూ నాగ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు.
ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ద ఘోస్ట్’లో నాగార్జున, విక్రమ్ అనే ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటించారు. అక్కకి అండగా ఉండేందుకు ఇండియాకి వచ్చిన విక్రమ్.. ఎలాంటివి ఫేస్ చేశాడు. చివరకు ఏం జరిగింది అనేది స్టోరీ. ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా చేసింది. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నవంబరు 2 నుంచి అందుబాటులోకి రానుంది. మరి థియేటర్లలో అంతంత మాత్రంగా ఆడిన ఈ చిత్రం.. ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ‘ద ఘోస్ట్’ ఓటీటీ కోసం మీలో ఎంతమంది వెయిటింగ్.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
#ghostMovie Ott Date@WhatsTrending @AniTrendz @TheViralFever @itsgoneviraI @ViralPosts5 #Trending #Viral pic.twitter.com/Cja31JO9eC
— telugufunworld (@telugufunworld) October 22, 2022