హమ్మయ్యా.. ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘కాంతార’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫైనల్ గా సర్ ప్రైజ్ చేస్తూ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా రిలీజైనప్పడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ గత రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తూ దూసుకుపోయింది. అస్సలు ఊహకే అందని వసూళ్లు సాధించింది. ఈ సినిమాని థియేటర్లలో మళ్లీ మళ్లీ చూసిన ప్రేక్షకులు.. ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ వెయిట్ చేశారు. ఇప్పుడు వారిని ఆశ్చర్యపరిచేలా ఓటీటీ రిలీజ్ ప్రకటించారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిపోయిన తర్వాత సినిమా నచ్చితే చాలు జనాలు ఎగబడి మరీ చూస్తున్నారు. కానీ అందుకు తగ్గ సరైన చిత్రాలే రావట్లేదు. ఇలాంటి టైంలో కేవలం కన్నడలో మాత్రమే రిలీజైన ‘కాంతార’ టాక్ పాజిటివ్ గా వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ లో చూసిన పలువురు ఇతర భాషల సినీ ప్రేమికులు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది జరిగిన కొన్ని రోజులకు తెలుగు, తమిళంలో రిలీజైంది. వీటిలో కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీలోనూ విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
అలా కేవలం రూ.15 కోట్లతో తీసిన ‘కాంతార’.. ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైనే వసూళ్లు సాధించింది. కర్ణాటకలోనే ‘కేజీఎఫ్’తో పాటు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి పడేసింది. ఇంత జరుగుతున్నా సరే ఓటీటీ రిలీజ్ గురించి మాత్రం ఒక్క విషయం బయటకు రాలేదు. అప్పుడు ఇప్పుడు అని చెప్పారు. సరైన డేట్ మాత్రం చెప్పలేదు. ఇలా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి.. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ సర్ ప్రైజ్ చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో ఓటీటీ లవర్స్ నైట్ అవుట్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. మరి మీలో ఎంతమంది ‘కాంతార’ ఓటీటీలో కూడా చూసేందుకు రెడీ. కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
putting an end to all the wait!!! 🤯#KantaraOnPrime, out tomorrow@hombalefilms @shetty_rishab @VKiragandur @gowda_sapthami @AJANEESHB @actorkishore pic.twitter.com/HBsEAGNRbU
— prime video IN (@PrimeVideoIN) November 23, 2022