'కాంతార' ఇష్యూ మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా హైకోర్టు.. మూవీ టీమ్ కి షాకిచ్చింది. దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఓ చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ల ముందు అలానే ‘కాంతార’ చాలా అంటే చాలా పాపులర్ అయింది. ఉత్తర కర్ణాటకలోని గిరిజన సంప్రదాయం ఆధారంగా తీసినప్పటికీ.. కంట్రీ వైడ్ ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చెప్పాలంటే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అంతా బాగానే ఉన్నప్పటికీ ‘వరహా రూపం’ పాట మాత్రం వివాదంలో చిక్కుకుంది. కాపీ రైట్ ఇష్యూ వల్ల కొన్నాళ్ల పాటు నడిచిన ఈ వివాదం క్లియర్ అయినట్లు కనిపించింది. కానీ ఇప్పుడు అది మళ్లీ మొదటికొచ్చింది.
ఇక విషయానికొస్తే.. ‘కాంతార’ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. భూమి కోసం ఓ ఊరి వాళ్లు చేసే పోరాటం. దానికి కల్చర్ ని జోడించి తీయడం, మరీ ముఖ్యంగా ఆ క్లైమాక్స్ అయితే చూసిన ప్రతిఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పటికీ ఆ పాట వింటుంటే.. మనకు తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతాం. అయితే ఈ సాంగ్ ని తమ పాట నుంచి కాపీ కొట్టారని.. చాన్నాళ్ల క్రితం కేరళకు చెందిన తైకుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగింది. పిటిషన్ పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. ఈ పాటని నిషేధించింది. దీంతో ఓటీటీలో మూవీలో రిలీజైనప్పుడు దాని బదులు మరో పాట పెట్టారు.
అయితే ‘వరహారూపం’తో పోలిస్తే ఆ సాంగ్.. ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. ‘కాంతార’ మూవీ టీమ్.. ఈ విషయమై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. కేరళ హైకోర్టు ఆదేశాలని తోసిపుచ్చారు. దీంతో ‘వరహారూపం’.. మరోసారి అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. తాజాగా ‘కాంతార’ టీమ్ కేరళ హైకోర్ట్ మరోసారి షాకిచ్చింది. ఈ సాంగ్ ని నిషేధిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్స్, ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ ఎక్కడా యూజ్ చేయొద్దని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను మే 4లోపు తమకు సమర్పించాలని అల్టిమేటమ్ జారీ చేసింది. దీంతో ‘వరహారూపం’ ఇష్యూ కాస్త మళ్లీ మొదటికొచ్చింది. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందోనని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వివాదంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.