సినీ రంగంలో చిన్న సినిమాలకు, అందులోనూ కాలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కి ఎప్పుడూ మంచి ఫీడ్‌బ్యాక్ దక్కుతుంది. కంటెంట్ ఉంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆదరిస్తుంటారు ప్రేక్షకులు. అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి.
సినీ రంగంలో చిన్న సినిమాలకు, అందులోనూ కాలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కి ఎప్పుడూ మంచి ఫీడ్‌బ్యాక్ దక్కుతుంది. కంటెంట్ ఉంటే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆదరిస్తుంటారు ప్రేక్షకులు. అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘బేబి’ మూవీని ఉదాహరణగా చెప్పొచ్చు. ఇలాగే కన్నడ ఇండస్ట్రీలో ఓ చిన్న సినిమా సంచలనం సృష్టిస్తుంది. అదే ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ (Hostel Hudugaru Bekagiddare). ‘కేజీఎఫ్-2’, ‘చార్లీ’, ‘కాంతార’ తర్వాత కన్నడ పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు.
చాలా కాలం తర్వాత ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ మూవీతో కాస్త ఊరట పొందారు కన్నడ సినీ లవర్స్. గత శుక్రవారం (జూలై 21) విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది. ముఖ్యంగా యూత్‌కి కాన్సెప్ట్ కనెక్ట్ అవడంతో ఎగబడి మరీ చూస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాతో నితిన్ కృష్ణమూర్తి దర్శకుడిగా పరిచయమయ్యాడు. హీరో రక్షిత్ శెట్టి సమర్పిస్తూ.. అథిది పాత్రలో కూడా మెరిశారు. అలాగే సీనియర్ హీరోయిన్ దివ్య స్పందన (రమ్య), ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి కూడా అతిథి పాత్రలో కనిపించారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ తన సంగీతంతో సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాడు. ఇంతకీ ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ అంటే అర్థం ఏంటో తెలుసా?. ‘హాస్టల్ పిల్లలు కోరుకుంటే’.. ప్రస్తుతం కన్నడ వెర్షన్ మాత్రమే రన్ అవుతోంది. అక్కడి టాక్ చూసి త్వరలో తెలుగులో డబ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
హాస్టల్‌లో ఒకే గదిలో ఉండే ఐదుగురు స్టూడెంట్స్‌లో ఒకతనికి షార్ట్ ఫిలిం తియ్యాలని కోరిక. ఎగ్జామ్స్ ఉండడంతో ఫ్రెండ్స్ వద్దని చెప్తారు. అంతలో ఓ రోజు సడెన్‌గా హాస్టల్ వార్డెన్ శవం దొరుకుతుంది. తన చావుకి వీళ్లు ఐదుగురే కారణమని, వాళ్ల పేర్లు ఓ నోట్‌లో రాసి ఉంటాడు వార్డెన్. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఈ కుర్రాళ్లు ఓ సీనియర్‌ని సాయమడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు స్టోరీ. ఈ ఏడాది కన్నడలో వచ్చిన భారీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో బోల్తా పడ్డాయి. అలాంటిది ఈ చిన్న సినిమా ఇంత భారీ విజయం సాధించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. యూత్‌ని ఆకట్టుకునే క్రైమ్ కామెడీతో కూడిన కథే ఈ సినిమాకి బలం. సినిమా చూసిన కొందరు కన్నడ క్రిటిక్స్.. చిత్రం మీద, చిత్రబృందంపైనా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఈ హీరోని గుర్తు పట్టారా?.. ఇంతలా మారిపోయాడేంటి!.