దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరీ సినిమాపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం ఈ సినిమాని ఒక కట్టు కథగా అభివర్ణించింది. తమిళనాడులో అయితే పలు మల్టీప్లెక్సుల్లో షోలను రద్దు చేస్తున్నారు. మరోవైపు కలెక్షన్స్ పరంగా చూస్తుంటే ఈ మూవీ దుమ్ము దులిపేస్తోంది.
ది కేరళ స్టోరీ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో చాలా మల్టీప్లెక్సుల్లో షోలను రద్దు చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి వివాదం నడుస్తూనే ఉంది. మతం మార్పిడి చేసి సిరియా తరలించి ఉగ్రవాదులుగా మార్చారు అనే ఆరోపణలతో ఈ సినిమాని తెరకెక్కించారు. మొదట 32 వేల మంది మహిళల యదార్థ జీవితం ఆధారంగా అని చెప్పుకొచ్చినా తర్వాత ముగ్గులు యువతుల జీవితం ఆధారంగా సినిమా నిర్మించినట్లు డైరెక్టర్ సుదీప్తో సేన్ చెప్పుకొచ్చారు. ఇన్ని వివాదాల నడుమ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి.
ది కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మ, సిద్ది ఇదాని, యోగితా లీడ్ రోల్స్ ప్లే చేశారు. కేరళ స్టోరీ సినిమా వివాదాల నేపథ్యంలో అందరూ ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని ఎదురుచూడటం ప్రారంభించారు. థియేటర్లలో వివాదాలు, షోస్ క్యాన్సిల్ చేయడం వంటి సంఘటనల దృష్ట్యా సినిమాని ఓటీటీ రిలీజ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదేమో అని మేకర్స్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ది కేరళ స్టోరీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయ్యారని చెబుతున్నారు. జీ5లో కేరళ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది అంటున్నారు. అయితే మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. విడుదలైన తర్వాత 4 నుంచి 6 వారాల్లో ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకన్నా ముందే ఓటీటీలో ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
And for the the few still calling #TheKeralaStory a propaganda film ,saying these incidents do not exist even after watching testimonials of several Indian victims,,,my humble request , Google two words ISIS and Brides…maybe an account of white girls narrated to you might make… pic.twitter.com/qYBp3B3owQ
— Adah Sharma (@adah_sharma) May 6, 2023
ఇంక ది కేరళ స్టోరీ కలెక్షన్స్ చూస్తే.. మొదటి రోజు దాదాపు రూ.8 కోట్లు కలెక్ట్ చేయగా.. రెండో రోజు రూ.12.5 కోట్లు, మూడో రోజు రూ.16 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు లెక్కలు చెబుతున్నారు. ఈ లెక్కన ది కేరళ స్టోరీస్ కలెక్షన్స్ పరంగా మంచి రికార్డులే బద్దలు కొడుతుందని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాపై నెగిటివిటీ రావడంపై హీరోయిన్ అదా శర్మ స్పందించింది. కేరళ స్టోరీని ప్రోపగండా అని అనుకునేవారు, టెస్టిమోనియల్స్ చూసిన తర్వాత కూడా ఈ ఘటనలు జరగలేదని నమ్మేవారు ఒకసారి ఐఎస్ఐఎస్ఐ అండ్ బ్రైడ్స్ అని గూగుల్ చేయాల్సిందిగా కోరింది. కొందరు వైట్ గర్ల్స్ చెప్పిన కొన్ని విషయాలు మీకు మన ఇండియన్ సినిమా నిజమని నమ్మేలా చేస్తాయేమో అంటూ అదా శర్మ చెప్పుకొచ్చింది.