అమెరికా- ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా టెక్ కంపెనీ ట్విట్టర్ సీఈఓగా మన భారతీయుడు పరాగ్ అగర్వాల్ నియమింపబడ్డ సంగతి తెలిసిందే. ట్విటర్ సీఈవోగా ఉన్న జాక్ డోర్సీ వైదొలిగడంతో, అతని స్థానంలో భారత్ కు చెందిన పరాగ్ అగర్వాల్ ట్విటర్ కొత్త సీఈవోగా పదవీభాద్యతలు చేపట్టారు. ఇ
ప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి దిగ్గజ కంపెనీలకు మన భారతీయులే సీఈఓలుగా ఉండగా, ఇప్పుడు మరో అంతర్జాతీయ టెక్ సంస్థ ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమించపబడటంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇక ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ పేరు ప్రకటించినప్పటీ నుంచి లక్షలాది మంది నెటిజన్లు పరాగ్ ఏక్కడ చదువుకున్నాడు, ఆయన వయసు ఎంత, పరాగ్ కు జీతం ఎంత వస్తుందని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.
ట్విట్టర్ సీఈఓగా నియమించపడ్డ పరాగ్ అగర్వాల్ వేతన వివరాలను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు సమర్పించిన ఫైలింగ్ లో ట్విట్టర్ తెలియజేసింది. 37 ఏళ్ల పరాగ్ అగర్వాల్ వార్షిక వేతనం ఒక మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు 7.5 కోట్లుగా ఉందని తెలుస్తోంది. అంతే కాదు నియంత్రిత స్టాక్ యూనిట్ల నుంచి సుమారు 12.5 మిలియన్ల డాలర్ల, అంటే మన భారత కరెన్సీలో సుమారు 93.9 కోట్లును పరాగ్ పొందనున్నారు.
అంతే కాదు వీటితో పాటు ట్విట్టర్ అందించే బోనస్ లు, ఇతర ప్రయోజనాలను పరాగ్ అగర్వాల్ పొందనున్నారు. అంటే ట్విట్టర్ సీఈఓగా పరాగ్ సంవత్సరానికి సుమారు 120 కోట్ల రూపాయలను పొందుతారని తెలుస్తోంది. ముందు ముందు కంపెనీ షేర్ వ్యాల్యూ పెరిగే కొద్ది పరాగ్ అగర్వాల్ వేతనం కూడా పెరుగుతుంది.