స్వల్పంగా పెరిగిన బంగారం ధర
భారీగా తగ్గిన వెండి ధర
10గ్రా 22 క్యారెట్ 350 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 390 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,900.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,980.
1కిలో వెండి 71,500
బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 35 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 39 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 350 రూపాయలు తగ్గి 44 వేల 900 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 390 రూపాయలు తగ్గి 48 వేల 980 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర బారగా పెరిగింది. వెండి ధర కిలో 4 వేల రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 71 వేల 500 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 250 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 260 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,420 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,310 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,310 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,410 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,720 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.