బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 45 వేల 350 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 49 వేల 480 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధరలోను మార్పు లేదు. మార్కెట్లో వెండి కిలొ 66 వేల 200 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 350 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 380 రూపాయలు పెరిగింది.