స్వల్పంగా పెరిగిన బంగారం ధర
భారీగా తగ్గిన వెండి ధర
10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 160 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,200.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,220.
1కిలో వెండి 63,200
బిజినెస్ డెస్క్- ఈ రోజు గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 16 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు పెరిగి 44 వేల 200 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 160 రూపాయలు పెరిగి 48 వేల 220 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర భారీగా తగ్గింది. ఏకంగా 5000 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 63 వేల 200 రూపాయలు పలుకుతోంది. గత పది క్రితం 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరలు నేటి ధరలతో సరిసమానంగా ఉన్నాయి.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 560 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,610 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,480 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,480 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,490 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,690 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.