స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 250 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 260 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,150.
24 క్యారెట్ 10గ్రా బంగారం 49,250.
1కిలో వెండి 66,100
బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 25 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 26 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగి 45 వేల 150 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 260 రూపాయలు పెరిగి 49 వేల 250 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 400 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 66 వేల 100 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 300 రూపాయలు తగ్గగా, 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 340 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 350 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,480 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47 వేల 250 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 49 వేల 250 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,040 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,320 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.