హైదరాబాద్- తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. యాక్టివ్ గా ఉంటడమే కాదు.. ప్రజలు ఎవరు ఏ సమస్య తన దృష్టికి తెచ్చినా వెంటనే స్పందింస్తారు. సాధ్యమైనంత వరకు వారి సమస్యను ప్రభుత్వం ద్వార తీర్చేందుకు ప్రయత్నిస్తారు కేటీఆర్. లేదంటే ఒక్కోసారి తాను వ్యక్తిగతంగా కూడా సాయం చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతున్న సమయంలో కూడా కేటీఆర్ వేగంగా స్పందించారు. కరోనా నుంచి కోలుకున్న పలువురు రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు. బ్లాక్ ఫంగ్‌సతో శనివారం మెదక్ జిల్లా లో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో మరొకరు చనిపోయారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలుండటంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌కు ఓ యువతి బ్లాక్ ఫంగస్ విషయంలో ఓ రిక్వెస్ట్ చేసింది.
బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న తన స్నేహితురాలి తండ్రికి బెడ్ అవసరం ఉందని.. దీనికి చికిత్స అందుబాటులో ఉన్న కేంద్రాలు ఏమైనా ఉన్నాయా.. నాకు తెలియజేయండి అని ఓ యువతి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వార కోరింది. ఆ యువతి చేసిన ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. అతన్ని కోఠిలోని ఈఎన్ టీ ఆసుపత్రిలో చేర్పించవచ్చని సూచించిన కేటీఆర్.. ఆ యువతికి సహాయం చేయాలని ఆయన కార్యాలయానికి చెప్పారు. కేటీఆర్ ఆఫీస్ సిబ్బంది వెంటనే దీనిపై స్పందించి నోట్ చేసుకున్నాం సర్ అని రిప్లై ఇచ్చారు. ఆ తరువాత కేటీఆర్ కార్యలయం సాయంతో ఆ యువతి స్నేహితురాలి తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇలా ట్విట్టర్ లో సాయం కోరగానే స్పందించి హెల్ప్ చేసిన మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.