మంత్రి కేటీఆర్ తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ పొరుగు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలంగాణ అభివృద్థిపై మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఎద్దేవ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. యువ నాయకుడిగా అద్భుతమైన ప్రతిభతో తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రతిపక్షనాయకుల విమర్షలకు తనదైన స్టైల్లో కౌంటర్లిస్తూ నీళ్లు నమిలేలా చేస్తాడు. కాగా తాజాగా తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలల్లో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిగురించి చెప్తూ ప్రతిపక్షాలను ఎద్దేవ చేశారు. పల్లె, పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో చేపట్టిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి మంత్రి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పాడు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని వారు ఒప్పుకున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రంలోని చంద్రబాబు, జగన్‌కు అర్థమైంది. కానీ రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవ చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 100 ఎకరాలు కొనొచ్చు అని చంద్రబాబు గుర్తించారని తెలిపారు. రైతు సంక్షేమాన్ని కోరే సీఎం కేసీఆర్ కేంద్రం ఒత్తిడి చేసినా మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను సీఎం జగన్ కూడా మెచ్చుకున్నారు. దిశ ఘటన అంశంలో ఐ సెల్యూట్ టు కేసీఆర్ అని జగన్ కూడా మెచ్చుకున్నారని తెలిపారు. ప్రతిపక్షాలకు మాత్రం ఇవేమీ కనిపించట్లేదని వెల్లడించాడు.