జగనన్న వసతి దీవెన’నిధులను బుధవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అయితే అక్కడి నుండి పుట్టపర్తికి బయలు దేరాల్సి ఉండగా.. ఆయన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ‘జగనన్న వసతి దీవెన’ నిధులను బుధవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా నార్పలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు అయితే అక్కడి నుండి పుట్టపర్తికి బయలు దేరాల్సి ఉండగా.. ఆయన హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హెలీప్యాడ్‌లో కాసేపు సీఎం వేచి చూశారు కానీ సమస్య తీరలేదు. దీంతో అనంతరం రోడ్డు మార్గం గుండా ఆయన పుట్టపర్తికి బయలు దేరారు. సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఇదేమీ ప్రథమం కాదు.. గతంలో కూడా రెండు మూడు సార్లు ఇలానే చోటుచేసుకున్నాయి. సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో లోపం వార్త వినగానే ప్రజల్లో ఆందోళన నెలకొంది.
జగనన్న వసతి దీవెన కార్యక్రమం కోసం తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ అనంతపురంలోని శింగమనల నియోజకవర్గంలో పర్యటించారు. హెలికాఫ్టర్‌లో నార్పలకు చేరుకున్నారు ఏపీ సీఎం జగన్. అయితే సమావేశానంతరం పుట్టపర్తి వెళ్లాల్సి ఉండగా.. అనుకోకుండా ఆయన హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కాసేపు వేచి చూశారు. ఆ లోపాలు సరికాకపోవడంతో రోడ్డు మార్గాన పుట్టపర్తికి వెళ్లారు. కాగా, ఆయన పుట్టపర్తి నుండి విజయవాడకు ప్రత్యేక విమానంలో రానున్నట్లు తెలుస్తుంది.
కాగా, గతంలో ఆయన తండ్రి, మాజీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలోనే చనిపోవడంతో.. ఇటువంటి వార్తలతో అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జగనన్న వసతి దీవెన ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకురూ.20 వేలు చొప్పున సాయం అందించారు.