ఓ కార్పెంటర్ ప్రతిభను తన వృత్తిలో నిరూపించుకున్నాడు. సాధారణంగా మన ఇళ్లలో జరిగే సత్యనారాయణ కథకు ఉపయోగించే పీఠం అందరికి తెలుసు. కానీ ఓ వడ్రంగి తన క్రియేటివిటీని ప్రదర్శించి సూట్‌కేస్‌లా మడత పెట్టే విధంగా తయారు చేశాడు
మంత్రి కేటీఆర్ తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగిస్తూ పొరుగు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలిపాడు. తెలంగాణ అభివృద్థిపై మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఎద్దేవ చేశారు.
ఆ బాలిక ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పుట్టినప్పటి నుంచే ఒక కాలు లేకపోయినా.. ఎంతో కష్టపడి చదువుతుంది. ఒంటికాలితో రోజూ 2 కిలోమీటర్లు కుంటుతూ.. ఆమె పాఠశాలకు వెళ్లొస్తోంది. చదువుపై ఉన్న ఇష్టమే ప్రేరణగా మారి.. కృత్రిమ కాలు అమర్చుకునేందుకు స్థోమత లేకపోవడంతో అలాగే చిన్నప్పటి నుంచి స్కూల్ కు వెళ్లొస్తోంది. ఆ బాలికకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ చలించిపోయాడు. తాను […]
మూడేళ్ల క్రితం జర్మనీలో ఉన్నత చదువులను అభ్యసించడానికి వరంగల్ జిల్లా కరీమాబాద్‌కి చెందిన కడారి అఖిల్ వెళ్లాడు. రెండు రోజల క్రితం ఓ నదిలో గల్లంతయ్యాడు. ఈ ఘటనతో అఖిల్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ, తమ కొడుకు వివరాలను తెలిపేందుకు సాయం చేయాలంటూ కేటీఆర్‌ను ట్విటర్ ద్వారా కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. తన వంతు సాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రేట్ వరంగల్ కి చెందిన కడారి అఖిల్ […]
ఇటీవల తెలంగాణ విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందిని.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయకుండా భాజపా నాయకులు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల పై మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర […]
కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కష్టాలు మొదలయ్యాయని.. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్నదాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మోదీ పాలనతో సామాన్యులు వంటింటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారని సిలిండర్లపై రూ.లక్ష కోట్ల సబ్సిడీ ఎత్తి వేశారన్నారు. మోదీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటింది. గ్యాస్ సిలిండర్‌ఫై రాయితే ఎత్తివేయడమే అధిక ధరకు కారణం అన్నారు. ఎక్కడో జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి.. ధరలు పెంచడం ఎక్కడైనా […]
పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు హైదరాబాద్ రావాలని ఆహ్వానిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ పెద్ద రాజకీయ వేడిని రాజేసింది. ఆ ట్వీట్ పై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. హైదరాబాద్ కు ఆహ్వానిస్తూ కేటీఆర్ ట్వీట్ చేయడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచ నలుమూలల నుంచి వ్యాపార వేత్తలు బెంగళూరు వస్తుంటారని తెలిపారు. ‘అత్యధికంగా స్టార్టప్స్, యూనికాన్ సంస్థలున్న బెంగళూరు ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. గత మూడేళ్లుగా ఆర్థికంగా ప్రగతి సాధిస్తోంది’ అంటూ బసవరాజు బొమ్మై వ్యాఖ్యానించారు. […]
తెలంగాణకు పరిశ్రమలను ఆహ్వానించే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా తనదైన మాస్టార్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్. ఈ మద్య ఓ కార్యక్రమంలో ఐటీ కంపెనీలు బెంగుళూర్ వదిలి హైదరాబాద్ వస్తే మరింత సౌకర్యం ఉంటుందని ఒక ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవల ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఖాతాబుక్ సీఈఓ రవీశ్ […]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో విదేశాల నుంచి వచ్చి కంపెనీలు నెలకొల్పడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయనే సంకల్పంతో మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలు విదేశీ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు చేశారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ సత్తా చాటుతున్నారు. పలు కంపెనీలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న కేటీఆర్.. […]
హైదరాబాద్- హైదరాబాద్ వేధికగా 19వ బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. వర్చువల్ విధఆనంలో మొదలైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత, గిఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బిల్ గెట్స్, తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే కరోనా వైరస్ మనకు ఎన్నో గుణపాఠాలు […]