పెళ్లెప్పుడవుతుంది బాబు నాకు పిల్ల యాడ దొర్కుతుంది బాబూ.. ఇదే ఇప్పుడు పట్నంలో ఉండే పెళ్లికాని యువకులందరి గుండెలోతుల్లోంచి వచ్చే పాట. బెండకాయ ముదిరనట్టు ముదిరిపోతున్నా పెళ‌్లి ముచ్చట తీరని పెళ్లికాని ప్రసాద్ ల సంఖ్య పట్నంలో రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలామంది బ్యాచ్ లర్లకు 30 దాటినా ఇంకా పెళ్లి కావడంలేదు, ప్రతీ 100 మంది అబ్బాయిలకు 87 మంది అమ్మాయిలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నా పెరిగిపోతున్న బ్యాచిలర్ బాబులను చూస్తుంటే ఆడపిల్లల సంఖ్య ఇంకా తక్కువే ఉందని తెలుస్తుంది. దీనకి ఓ కారణం ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే వాళ్లకు సమాది కట్టేస్తున్న ఎందరో తల్లిదండ్రులు.సంబందాలు చూసీ చూసీ ఎవ్వరూ పిల్ల నివ్వకపోవడంతో అసలు పెళ్లి మీదనే విరక్తి పుడుతున్న బ్యాచిలర్ బాబులెందరో ఇంకొందరేమో ముప్పై ఏండ్లు దాటినా పెళ్లికి నో అంటున్నారు. తీరా సెటిల్ అయిన తర్వాత తగిన జోడీ దొరక్క అల్లాడిపోతున్నారు. ఓ యువకుడు మాత్రం కాస్త వెరైటీగా ఆలోచించాడు. తన మెదడులోకి వచ్చిన ఆలోచనను వెంటనే అమలు పరిచాడు.
వధువు కావాలంటూ ఏకంగా తన షాప్‌కే బోర్డ్ పెట్టాడు. కేరళ త్రిచూర్‌లోని ఉన్ని కృష్ణన్ (33) తన పెళ్లి కోసం అనేక చోట్లకు తిరిగాడు. కానీ ఎక్కడా సంబంధం సెట్ కాలేదు. దీంతో ఏకంగా తన టీ స్టాల్ ముందు వధువు కావలెను అంటూ బోర్డ్ పెట్టాడు. అతనికి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి. అయితే ఉన్నికృష్ణన్‌కు ఇదంతా తెలియదు. అతను తిరిగ్గా షాపులో కూర్చుని తనకు వచ్చిన ప్రపోజల్స్ వెతికే పనిలో ఉన్నాడు. నేను రోజువారీ కూలీని. నా తలలో కణతి ఉండటంతో సర్జరీ కూడా జరిగింది. దాని నుంచి పూర్తిగా రికవరీ అయ్యాను.
ఇప్పుడు జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నా. లక్కీగా ఓ లాటరీ తగలడంతో టీస్టాల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నను. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు సంబంధాలు వెతికారు. అవేవీ సెట్ కాలేదు. అందుకే ఇలా సైన్ బోర్డ్ పెట్టాను అని ఉన్నికృష్ణన్ తెలిపాడు.
Man on a mission! Wanting to find his life partner on his own, Unnikrishnan – a native of Vallachira in Kerala – put up a signboard in front of his shop that read, ‘Looking for a life partner. Caste or religion not an issue’. His story👇@gopikavarrier1 https://t.co/Vrp9ztB4Vj
— The New Indian Express (@NewIndianXpress) August 31, 2021