విశాఖపట్నం- గతంలో పార్టీ లేదు బొక్కా లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మరోసారి బాంబ్ పేల్చాడు. చంద్రబాబు అసలు రూపం ఇదే అంటూ పార్టీ అధ్యక్షుడి గుట్టురట్టు చేశారు. టీఎన్‌టీయూసీ అనుబంధ సంస్థ తెలుగునాడు విద్యుత్ కార్మికసంఘం ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్‌లను విశాఖలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘‘కార్యకర్తల్ని దగ్గర చేసుకోవడంలో మేం కొన్ని తప్పులు చేశాం. మిమ్మల్ని పటించుకోలేదు. మీరు మాతోనే ఉన్నారని అనుకున్నాం. ఇక తెలుగుదేశం ముఖ్య నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు సోదంతా చెబుతారు. అధికారం వచ్చిన తర్వాత మొత్తం మీకే సర్వం ఇస్తామని చెబుతారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడో ఉంటారు.. చంద్రబాబు అధికారుల మాటే వింటారు’’ అన్నారు.
ఇది కూడా చదవండి : భువనేశ్వరి అక్కా.. మా కన్నీటితో మీ కాళ్ళు కడుగుతాం-ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
‘‘కానీ ఈసారి చంద్రబాబు వినకపోయినా మేమందరం ఆయనకు నచ్చజెప్పి ప్రజాపరిపాలన తీసుకువస్తాం. కార్యకర్తల మాటకు విలువ ఇచ్చే విధంగా, కార్మికులకు న్యాయం జరిగే విధంగా దగ్గరుండి చేసే బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తీసుకుంటా..’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన తన ప్రసంగంలో చంద్రబాబును ఏకవచనంతో సంబోధించమే కాక చంద్రబాబు.. కార్యకర్తలతో ఎలా వ్యవహరించాలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తానే గైడ్ చేస్తాననే రీతిలో సాగిన అచ్చెన్న మాటలు ఇప్పడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇది కూడా చదవండి : జగన్ పై విషం కక్కుతున్న చంద్రబాబు, రఘురామ..బట్టబయలైన ఆశ్చర్యకరమైన నిజాలు