ఆంధ్రప్రదేశ్.. నెల్లూరు నారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కలేదు. టీడీపీ హయాంలో ఆయన రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు.
టీడీపీ నేత, మాజీమంత్రి నారాయణ పై అతని తమ్ముడు సతీమణి సంచలన ఆరోపణలు చేయడంతో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా తనను ఎన్నో రకాలుగా టార్చర్ చేస్తున్నారని నారాయణ తమ్ముడి భార్య ప్రియ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా డేగలా తనపై కన్నేశారని, చిత్ర హింసలు పెడుతూ పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..
ఏపీ టీడీపీ నేత నారాయణ పై అతని తమ్ముడు భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. ‘కొంతకాలంగా తనపై డేగ కన్ను వేశారని.. ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్లు తన పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. మోసపోయిన పిట్టను తనేనని అంటూ వ్యాఖ్యనించారు. ఇంట్లో తన భార్య ఉండగానే.. అర్థరాత్రి వేళ అన్నం తీసుకురాలేదని తనను చిత్ర హింసలు పెట్టి కొట్టాడని.. నానా మాటలు అన్నాడని వాపోయింది. నవ్వుతూ వీడియో ప్రారంభించిన ప్రియ.. తర్వాత ఏడుస్తూ ముగించింది’ ప్రియ. గత ఎన్నికల్లో తనను ప్రచారం చేయమని ఎంతో ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.. తన కుటుంబాన్ని కూడా నారాయణ ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని.. అందుకే టీడీపీ తరుపు నుంచి తాను ప్రచారం చేయలేదని వెల్లడించింది.
నారాయణ తమ్ముడి పేరు మణి.. ఆయన భార్యపేరు ప్రియ. వీరు ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఏపీలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో టీడీపీ నేత నారాయణపై ఇలాంటి ఆరోపణలు తెరపైకి రావడంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది. అయితే ఇప్పటి వరకు చేయని ఆరోపణలు ఏపీలో ఎన్నికలు జరగబోతున్న సమయంలోనే ఎందుకు చేశారు.. దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా అని టీడీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.