టెక్నాలజీ డెస్క్- ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. మొబైల్ ఫోన్ల రంగంలో 4జీ గొప్పనుకుంటే ఇప్పుడు 5జీ సైతం వచ్చేసింది. ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ రియల్మీ తన జీటీ 5జీ స్మార్ట్ ఫోన్‌తో పాటు కొత్త రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను సైతం విడుదల చేసింది. రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 2 ఇన్ 1 వాక్యూమ్, మాపింగ్ సొల్యూషన్ వంటి టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. ఇందుకోసం లైడార్ ఆధారిత నేవిగేషన్ సిస్టంను ఉపయోగించారు. ఇంటిలో ఖచ్చితమైన క్లీనింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇది అందిస్తుందని రియల్ మీ పేర్కొంది. ఈ వాక్యూమ్ క్లీనర్ పైభాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుపరిచారు.
ఈ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ లో మొత్తం 38 సెన్సార్లు ఉన్నాయి. ఇందులో వాటర్ ట్యాంక్ డిటెక్షన్ సెన్సార్, టైం ఆఫ్ ఫ్లైట్ వాల్ సెన్సార్, క్లిఫ్ సెన్సార్, ఇన్ ఫ్రారెడ్ రీచార్జ్ సెన్సార్ల వంటివి ఉన్నాయి. రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ లో లైడార్ సిస్టం ద్వారా ఈ టెక్ లైఫ్ రోబోట్ వాక్యూమ్, మిగతా వాక్యూమ్ క్లీనర్ల కంటే 12 శాతం ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. మ్యాపింగ్‌లో ఏకంగా 98 శాతం కచ్చితత్వంతో ఇది పనిచేయనుందని తెఅంటున్నారు. ఎంఐ రోబోట్ వాక్యూమ్ పీ, ఇతర వాక్యూమ్ క్లీనర్ల తరహాలోనే రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్‌ను కూడా యాప్‌కు లింక్ చేసుకుని ఆపరేట్ చేయవచ్చట. ఇక క్లీనింగ్ మోడ్స్ సెట్ చేయడం, క్లీనింగ్ షెడ్యూల్ చేయడం, కస్టమ్ పార్టీషన్స్ క్రియేట్ చేయడం వంటి వాటిని ఫోన్ నుంచే కంట్రోల్ చేయవచ్చని రియల్ మి కంపెనీ చెబుతోంది.
గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంతే కాదు 3000 పాస్కల్స్ వరకు సక్షన్ పవర్ కూడా ఇందులో ఉంది. దీంతో పాటు 5200 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో పొందుపరిచారు. ఒక్కసారి రీ చార్జ్ చేస్తే 100 చదరపు మీటర్లకు పైబడిన గదిని మూడు సార్లకు పైగా శుభ్రం చేయవచ్చు. రియల్ మీ టెక్ లైఫ్ రోబోట్ వాక్యూమ్ ధరను 299 యూరోలుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో 26,600 రూపాయలన్నమాట. దీనికి సంబంధించిన ప్రీ సేల్ రియల్మీ.కాం, అలీ ఎక్స్ప్రెస్ల్లో జూన్ 16వ తేదీ నుంచి ఈ రోబోట్ వ్యాక్యూమ్ ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది మనదేశంలో ఎప్పుడు లాంచ్ చేస్తున్నారో మాత్రం కంపెనీ చెప్పలేదు.