ప్రతి నెల మార్కెట్ లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల అవుతూనే ఉంటాయి. అయితే చాలావరకు ప్రీమియం ఫోన్లే విడుదల అవుతున్నాయి. కానీ, మార్చి నెలలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా రాబోతున్నాయి.
స్మార్ట్ ఫోన్స్ అంటే చాలామంది ఇష్టపడతారు. చాలామంది కొత్త మోడల్, సరికొత్త ఫీచర్స్ ఉన్న ఫోన్స్ కొనాలనుకుంటారు. అయితే స్మార్ట్ ఫోన్ కొనుగోలు విషయంలో మాత్రం కంగారు పడకూడదని టెక్ నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు కంగారుగా ఫోన్ కొనేస్తే.. తర్వాత అంతకన్నా బెటర్ పీచర్స్ తో ఫోన్లు విడుదలవుతాయి. ఫోన్ కొన్నాక కనీసం రెండు సంవత్సరాలైనా వాడాల్సిందే. అందుకే మీరు ఈ నెలలో ఫోన్ కొనాలి అనుకుంటున్నట్లైతే మీకోసం మార్చిలో విడుదల కాబోతున్న బెస్ట్ బడ్జెట్ ఫోన్స్ వివరాలు తీసుకొచ్చాం. వాటిలో మీకు ఏదైనా ఫోన్ నచ్చితే కొనేసుకోండి.
కొత్త మోడల్స్ విషయంలో రియల్ మీ కంపెనీ ఎప్పుడూ యూజర్లను నిరుత్సాహ పరచదు. తాజాగా మార్చి నెలలో రియల్ మీ 10s 5జీ రాబోతోంది. దీని ధరన రూ.13,500 నుంచి రూ.15 వేల మధ్య ఉంటుందని చెబుతున్నారు. దీనిలో 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది. అలాగే 8+256జీబీ వేరియంట్ కూడా ఉంటుందని చెబుతున్నారు. 8+128 జీబీ వేరియంట్ ధర రూ.13,500 నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. దీనిలో 6.6 ఇంచెస్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 400 నిట్స్ బ్రైట్ నెస్, 50 ఎంపీ+ 8 ఎంపీ కెమెరాతో వస్తోంది.
ఒప్పో కంపెనీ నుంచి మార్చి నెలలో ఏ58 అనే మోడల్ విడుదల కాబోతోంది. దీని ధర రూ.19,000 నుంచి ప్రారంభం కావచ్చు. దీనిలో మీడియాటెక్ డైమన్సిటీ 700ఏంటీ ఆక్టాకోర్ 8 ప్రాసెసర్, 6 జీబీ+ 128 జీబీ స్టోరేజ్, 6.56 ఇంచెస్ డిస్ ప్లే, 600 నిట్స్ బ్రైట్ నెస్, వాటర్ ప్రూఫ్, ఫేస్ అన్ లాక్, ఫింగర్ ప్రింట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50+ 2 ఎంపీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.20 వేలలోపు స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి మంచి ఛాయిస్ కావచ్చు.
లావా పవర్డ్ ఐకూ కంపెనీకి భారతదేశంలో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఐకూ మొబైల్ ఫోన్స్ మంచి ఫీడ్ బ్యాక్స్ అందుకున్నాయి. ఈ ఐకూ ఫోన్స్ లో మంచి కెమెరా క్వాలిటీ ఉంటోందని చెబుతున్నారు. ఇప్పుడు ఐకూ కంపెనీ Z సిరీస్ లో కొత్త ఫోన్ రాబోతోంది. అదే ఐకూ Z7 అనమాట. ఇది దాదాపుగా ఐకూ జెడ్6 ఫోన్ కు లుక్స్, ఫీచర్స్ విషయంలో దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు. దీనిలో 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 120 హెట్జ్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 64 ఎంపీ ఓఐఎస్+ 2+ 2 కెమెరా వంటి ఫీచర్స్ ఉంటాయంటున్నారు. మరోవైపు ఇంతకన్నా బెటర్ వర్షన్ ఇండియాలో రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. దీని ధర రూ.15 వేలకు లోపే ఉంటుందని తెలుస్తోంది.
శాంసంగ్ కంపెనీకి చెందిన గ్యాలెక్సీ సిరీస్ లో F14 పేరిట కొత్త మోడల్ మార్చిలో లాంఛ్ కాబోతోందని చెబుతున్నారు. స్పెసిఫికేషన్స్ విషయంలో రూమర్స్ ప్రకారం.. 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48+ 8+ 2+ 5ఎంపీ కెమెరాలు ఉంటాయని చెబుతున్నారు. మార్చి 10న విడుదల కానున్నట్లు చెబుతున్నారు. ఇంక దీని ధర విషయానికి వస్తే.. రూ.15 వేలలోపే ఉంటుందని తెలుస్తోంది.