ఎవరు ఇప్పుడు ఫోన్ కొనాలి అనుకున్నా.. స్మార్ట్ ఫోన్లే కొనేస్తున్నారు. అందుకే డిమాండ్ ఎక్కువ ఉన్న స్మార్ట్ ఫోన్లనే ఎక్కువగా తయారు చేస్తున్నారు. అన్ని కంపెనీలు కనీసం నెలకి ఒక మోడల్ ని విడుదల చేస్తోంది. ఇప్పుడు రియల్ మీ నుంచి ఒక కొత్త మోడల్ మార్కెట్ లో విడుదలైంది. ఆ మోడల్ బడ్జెట్ లో ఉండటమే కాదు.. అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది.
ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఫోన్ స్మార్ట్ ఫోన్ మాత్రమే అనేలా ఉంది పరస్థితి. మరి భారత్ లాంటి ఇంత పెద్ద మార్కెట్ లో డిమాండ్ కి తగినట్లు సప్లై చేయడం అంటే అంత తేలిక కాదు. ఇప్పటికే ఎన్నో కంపెనీలు స్మార్ట్ ఫోన్ తయారీని ప్రారంభించాయి. మీకు రియల్ మీ బ్రాండ్ గుర్తుండే ఉంటుంది. డిమాండ్ కి తగినట్లు బడ్జెట్ లో ఫోన్లు తీసుకొచ్చి ఈ కంపెనీ భారత్ లో ఎంతో క్లిక్ అయ్యింది. ముఖ్యంగా మధ్యతరగతి మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రియల్ మీ మోడల్స్ ని తీసుకొస్తుంటుంది. తాజాగా ఆ లిస్టులోకి ఇంకో అల్ట్రా స్లిమ్ డిజైన్ తో సరికొత్త మోడల్ ని తీసుకొచ్చారు. ఇప్పుడు మొబైల్ మార్కెట్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
స్మార్ట్ ఫోన్ యూజర్లకు రియల్ మీ కంపెనీ గురించి బాగా తెలుసు. ఎందుకంటే వీళ్లు బడ్జెట్ లో ఫోన్స్ తీసుకొస్తారు. అది కూడా అదిరిపోయే కెమెరాని తక్కువ ధర ఫోన్లలో తీసుకొస్తుంటారు. తాజాగా వీళ్లు ఒక సూపర్ బడ్జెట్ ఫోన్ ని తీసుకొచ్చారు. దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆ డిజైన్, ఫీచర్స్ కి వాళ్లు చెబుతున్న ధర చాలా తక్కువగా ఉండటమే. టెక్ నిపుణులు ఈ మోడల్ ఫుల్ పైసా వసూల్ అని చెబుతున్నారు. ఈ మోడల్ ని ఇటీవలే రియల్ మీ కంపెనీ లాంఛ్ చేసింది. సోషల్ మీడియా మొత్తం ఈ రియల్ మీ నార్జో ఎన్55 గురించే టాక్ నడుస్తోంది. ఈ ఫోన్ సేల్ ఏప్రిల్ 18న మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.
ఇంక ఈ రియల్ మీ నార్జో ఎన్55 మోడల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 7.89ఎంఎం విడ్త్ తోనే వస్తోంది. ఇందులో ప్రిస్మ్ బ్లూ, ప్రైమ్ బ్లాక్ అని రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంది. 680 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్ ఉంది. 64 ఎంపీ ఏఐ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తోంది. ఇంక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. రూ.10,999 నుంచి ప్రారంభమవుతోంది. అయితే దీనీపై హెచ్ డీ ఎఫ్ సీ, ఎస్ బీఐ బ్యాంకు కార్డులు కలిగిన వారికి అదనంగా రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్ తీసుకున్న వారికి అయితే అదనంగా రూ.3,000 విలువైన బహుమతులు పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.