రవిచంద్రన్ అశ్విన్.. ఇండియన్ లెజండ్రీ స్పిన్నర్స్ కి కూడా సాధ్యం కాని.. ఎన్నో రికార్డ్స్ ని సొంతం చేసుకున్న స్టార్ స్పిన్నర్. ఇప్పటికీ అశ్విన్ కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం టెస్ట్ బౌలర్స్ ర్యాంకింగ్ జాబితో అశ్విన్ రెండొవ స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి రికార్డ్స్ ఉన్న ఆటగాడికి ప్లేయింగ్ లెవన్స్ లో స్థానం కలగకపోవడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిజానికి అశ్విన్ వన్డేలలో కూడా అంతగా తీసేయదగ్గ బౌలర్ కాదు. కానీ.., కోహ్లీ కెప్టెన్ అయ్యాక అశ్విన్ ని పూర్తిగా వన్డేలకి దూరం చేసేశాడు. కుల్దీప్, చాహల్ వంటి స్పిన్నర్స్ అవకాశాలు కల్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా ఇండియన్ కెప్టెన్ అశ్విన్ కి టెస్ట్ జట్టులో స్థానం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో అశ్విన్ బెంచ్ కే పరిమితం అవుతూ రావడం అభిమానులను బాధిస్తోంది.
మొదటి టెస్ట్ తరువాత శార్దూల ఠాకూర్ గాయంతో వైదొలిగాడు. దీంతో..,సెకండ్ టెస్ట్ లోనైనా అశ్విన్ కి స్థానం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ.., కోహ్లీ ఇషాంత్ వైపు మొగ్గు చూపాడు. సరే.., మ్యాచ్ జరుగుతుంది విదేశాల్లో కాబట్టి ఫాస్ట్ బౌలర్ కి ఛాన్స్ ఇచ్చారు అనుకుందాం. కానీ.., ఇషాంత్ ఇప్పుడున్న ఫామ్ తో పోలిస్తే అశ్విన్ ఎక్కువ విక్కెట్స్ తీయగలడు. బ్యాటింగ్ లోను ఒక హ్యాండ్ వేయగలడు. అన్నిటికీ మించి.. ఈ టెస్ట్ సీరిస్ ప్రారంభంకి ముందే.., అశ్విన్ ఇంగ్లాండ్ కౌంటీలలో ఇవే పిచ్ లపై అద్భుతంగా బౌలింగ్ చేసి తనని తాను నిరూపించుకున్నాడు.
అయినా.., కోహ్లీ మాత్రం అశ్విన్ ని పక్కన పెడుతూనే వస్తున్నాడు. స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ లు జరిగే సమయంలో తప్పించి అశ్విన్ కి ప్లేయింగ్ లెవెన్ లో స్థానం దక్కడం లేదు. కెరీర్ పరంగా టాప్ ఫామ్ లో ఉన్న అశ్విన్ లాంటి సీనియర్ ప్లేయర్ ఇలా బెంచ్ కి పరిమితం కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్ లాంటి సీనియర్స్ ఈ విషయంలో పెదవి విరిచాడు కూడా. అయినా.., అశ్విన్ విషయంలో కోహ్లీ ఆలోచనా విధానం మారడం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో ఇప్పటికే కోహ్లీ, అశ్విన్ మధ్య ఓసారి వాగ్విదాం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తదుపరి టెస్ట్ లలో అయినా అశ్విన్ కి టీమ్ లో ప్లేస్ లభిస్తుందో లేదో చూడాలి. మరి.. ఈ విషయంలో మీ మద్దతు ఎవరికి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.