ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లినప్పుడు..టికెట్ తీసుకుని మన రైలు ఏ ఫ్లాట్ ఫాంపై ఉందా అని టీవి వంక చూస్తాం. దానిలో ఏం టైంకి మన ట్రైన్ వస్తుందని చూస్తాం. ఆ ఫ్లాట్ ఫాంకి వెళ్లాక కూడా రైలు రాకపోతే.. అక్కడే ఉన్న టీవీ తెరపైనా కనిపిస్తున్న యాడ్సో, సినిమా ప్రమోషన్ చూస్తాం. అయితే పాట్నా రైల్వే స్టేషన్ లో మాత్రం అశ్లీల దృశ్యాలు దర్శనమిచ్చాయి.
మనం ఏదన్నా ఊరు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లామనుకోండి.. ఏం చేస్తాం.. టికెట్ తీసుకుని ఫ్లాట్ ఫాంపై వెయిట్ చేస్తాం. ట్రైన్ కోసం వేచి చూస్తూ ఫోన్ చూసుకోవడమో లేదంటే.. అటు ఇటు తిరుగుతూ టైమ్ పాస్ చేస్తాం. రైలు కాస్త ఆలస్యమని తెలిస్తే.. ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న టీవీలో ఎప్పుడు రైలు వస్తుందో వివరాలు పరిశీలిస్తాం. అలాగే ఆ టీవీలో ప్రసారమయ్యే యాడ్స్, సినిమా ప్రమోషన్ల వీడియోలను చూస్తుంటాం. కామన్‌గా ప్రతి ప్రయాణీకుడు ఇదే చేస్తుంటారు. ఆదివారం ఉదయం ప్రయాణీకులంతా తాము ఎక్కాల్సిన రైలు కోసం వేచి చూస్తున్నారు. అదీ రావడానికి కొంత సమయం పడుతుండటంతో ఫ్లాట్ ఫామ్ పై ఉన్న టివీ స్ర్కీన్లను చూస్తున్నారు. అయితే ఆ టీవీలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుంది. టీవీలో రావాల్సిన యాడ్స్ రూపంలో ఏవో చిత్రాలు వస్తున్నాయి. ఒక్కసారిగా వాటిని చూసిన ప్రయాణీకులు ఖంగుతిన్నారు. ఇదేంటనీ మరోసారి చూస్తే అవే అశ్లీల చిత్రాలు దర్శనమిస్తున్నాయి.
ఈ ఘటన బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. పదో నెంబర్ ఫ్లాట్ ఫామ్ నెంబర్ 10పై ఉన్న టీవీల్లో అప్పటి వరకు ప్రసారమౌతున్న టీవీ యాడ్స్‌కు బదులు బ్లూ ఫిల్మ్‌లకు సంబంధించిన వీడియోలు ప్లే అయ్యాయి. సుమారు 3 నిమిషాల పాటు అడల్డ్ వీడియోలు రావడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ ఘటన ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సమయంలో ఫ్లాట్ ఫాంపై మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వెంటనే ప్రయాణీకులు గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్) కు ఫిర్యాదు చేశారు. జీఆర్పీ అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడంతో ఆర్పీఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు. యాడ్స్ ప్రదర్శించే దత్తా కమ్యూనికేషన్‌కు సమాచారం అందించారు.
ఆ తర్వాత సదరు సంస్థపై చర్యలు తీసుకున్నారు. ఆ యాడ్ ఏజెన్సీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు జరిమానా విదించి బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. అయితే వీటిని కొంత మంది వీడియోలు తీసి నెట్టింట్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తానా జంక్షన్‌లో రైళ్ల కోసం ప్రయాణికులు రైల్వే ఫ్లాట్ ఫామ్ నంబర్ 10 వద్ద ఎదురు చూస్తుండగా, టివి స్క్రీనల్లో ఏ రైలు ఎప్పుడు వస్తుందని వివరాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ టీవీల్లో యాడ్స్ కూడా వస్తుండగా, ఒక్క సారిగా బ్లూ ఫిల్మ్ రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు తలదించుకున్నారు. అశ్లీల వీడియోలు ప్రసారం అవుతుండడంతో ఆందోళన చెందారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చర్యలు తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే దీనిపై రైల్వే శాఖ ప్రత్యేక విచారణ జరుపుతుంది.