బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 మృతి చెందారు. ఈ విషయాన్ని బ్రిటన్ విదేశాంగ శాఖ కామన్వెల్త్ దేశాలకు తెలియజేసింది. ఆమె స్కాట్లాండ్‌లోని బల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. బ్రిటన్ సాంప్రదాయం ప్రకారం బకింగ్‌హామ్ ప్యాలెస్ గేట్లకు నోటీసులు కూడా అంటించారు. తన 25వ ఏట నుంచి బ్రిటన్ రాణిగా ఉన్న ఎలిజిబెత్-2 96 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఎలిజిబెత్-2 ఏప్రిల్ 21, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. 1947లో గ్రీస్ ప్రిన్స్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ అనే సంతానం ఉన్నారు. 1952లో తండ్రి మరణంతో ఎలిజిబెత్ బ్రిటన్ రాణి అయ్యారు. ఎలిజిబెత్ రాణిగా ఉన్న సమయంలో ఏకంగా 15 దేశాలు ఆమె రాజరికంలో పనిచేశాయి. కాగా.. బ్రిటన్‌కు ఎక్కువ కాలం క్వీన్‌గా కొనసాగిన రికార్డు ఎలిజిబెత్-2 పేరిటే ఉంది. 1952 నుంచి మరణించేంత వరకు ఆమె రాణిగా ఉన్నారు. ఇక ఎలిజిబెత్-2 తర్వాత ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్‌ను బ్రిటన్ రాజుగా ప్రకటించే అవకాశం ఉంది.
ఎలిజిబెత్-2 భర్త ఫిలిప్ 2021లో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. రాణి మరణంతో బ్రిటన్ జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేశారు. అన్ని చర్చిల్లో గంటలు మోగించారు. రాణి మరణంతో రాజ కుటుంబం అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. 10 రోజుల బ్రిటన్ పర్యటనకు వెళ్లిన ప్రిన్స్ చార్లెస్ తిరిగి వచ్చిన తర్వాత.. ఎలిజిబెత్-2 అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. అప్పుడే ఆమె పార్థీవ దేహాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి యూకే పార్లమెంట్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌కు తరలిస్తారు. ఆమె పార్థీవదేహాన్ని సందర్శించేందుకు ప్రజలకు కొన్ని రోజుల పాటు అనుమతించనున్నారు. రాణి అంత్యక్రియల రోజు యూకే వ్యాప్తం సెలవు దినంగా ప్రకటిస్తారు. ఎలిజిబెత్-2 అంత్యక్రియల్లో కొన్ని వందల మంది ఆర్మీ సిబ్బంది పాల్గొని గౌరవ వందనం సమర్పిస్తారు.
Liz Truss is mourning a great loss for the British Monarchy. Following Queen Elizabeth II’s death, the United Kingdom’s newly-appointed prime minister paid tribute to the late royal while helping usher in a new era with King Charles III’s pending succession. pic.twitter.com/TDosI1KQF0
— People (@people) September 8, 2022
We are deeply saddened and express our heartfelt condolences to the British Royal Family following the passing of Queen Elizabeth II. We are profoundly grateful for the Queen’s 70 years of dedicated service to the United Kingdom and the Commonwealth. pic.twitter.com/xutcOXaJRN
— G4S (@G4S) September 8, 2022