చికెన్ కబాబ్ తినడానికని వెళ్లిన బస్సు డ్రైవర్ ని అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. చికెన్ కబాబ్ ఆర్డర్ చేశాడు. కట్ చేస్తే 10 కోట్లు వచ్చి పడ్డాయి.
కొంతమందికి అదృష్టం శని పట్టినట్టు పడుతుంది. సరదాగా లక్ ని పరీక్షించుకుంటే సీరియస్ గా వచ్చి పడుతుంది. ఒక బస్సు డ్రైవర్ కి అదృష్టం అలానే పట్టింది. సరదాగా అదృష్టం ఎలా ఉందో చూసుకుందామని వెళ్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. అది కూడా చికెన్ కబాబ్ వల్లే. అవును చికెన్ కబాబ్ ఆ బస్సు డ్రైవర్ ని కోటేశ్వరుడ్ని చేసింది. ఒక కోటి, అర కోటి కాదు, ఏకంగా 10 కోట్లకు అధిపతిని చేసి పడేసింది. చికెన్ కబాబ్ తిందామని సూపర్ మార్కెట్ ముందు బస్సుని ఆపాడు. కిందకు దిగి చికెన్ కబాబ్, రొట్టె ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేస్తే కాసేపు ఎదురు చూడాలి కదా. మనోడు ఆగలేక పక్కనే ఉన్న ఓ లాటరీ షాపుకి వెళ్ళాడు.
ఈ ఘటన యూకేలోని లీసెస్టర్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డెవాన్ నగరంలోని హోల్స్ వర్తీకి చెందిన 51 ఏళ్ల స్టీవ్ గుడ్విన్ ఓ సూపర్ మార్కెట్ వద్ద బస్సుని ఆపి కబాబ్ ఆర్డర్ చేశాడు. కబాబ్ కి సమయం పడుతుందని చెప్పడంతో.. ఏమీ తోచక టైం పాస్ కోసం పక్కనే ఉన్న లాటరీ షాప్ కి వెళ్ళాడు. అక్కడ ఒక లాటరీ టికెట్ ని కొన్నాడు. ఆ లాటరీలో ఒక మిలియన్ యూకే డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీ ప్రకారం 10 కోట్ల 28 లక్షలు పైనే. తనకు లాటరీలో 10 కోట్లు గెలుచుకోవడంతో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా నమ్మలేకపోయాడు. పేదరికంలో ఉన్న తనకు ఏడ్చేశాడు. ఈ డబ్బుతో సొంత ఇల్లు కొనుక్కుంటానని అతను చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకూ అతను ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. లాటరీ గెలుచుకున్న తర్వాత అతను తన డ్యూటీకి వెళ్ళిపోయాడు.
తనకు కోట్లు వచ్చాయి కదా అని డ్యూటీ మానేయలేదు. కోటీశ్వరుడ్ని అయినా గానీ ఈ డ్రైవర్ గానే పని చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక తమకు లాటరీలో 10 కోట్లు తగలడంతో అతని భార్య వెకేషన్ ప్లాన్ చేసేసింది. ఇద్దరూ ఇప్పుడు హాలిడే ట్రిప్ లో ఉన్నారు. ఒక కారు కూడా కొనుక్కున్నారు. అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేము. పేదవాళ్ళు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. కాలం పేదవాడికి కూడా అవకాశం ఇస్తుంది అని అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. కాబట్టి 51 ఏళ్ల వయసులో గట్టిగా జీతమే సంపాదించడం కష్టం, అలాంటిది 10 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. కష్టపడి సంపాదించకపోవచ్చు, కానీ లాటరీ టికెట్ ని కొన్న డబ్బులు కష్టార్జీతమే కదా. వయసు అనేది మేటర్ కాదు, పేదరికం అన్నది అస్సలు సబ్జెక్టే కాదు. మీ ప్రయత్నానికి అదృష్టం తోడైతే చాలు.. కాలం ఒక అవకాశం ఇస్తే చాలు.. ధనవంతులవ్వచ్చు.