కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారతీయులు ఒకింత గర్వంగా భావిస్తారు. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి ఈ వజ్రం దేశానికి తీసుకొస్తే బాగుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కోహినూర్ కోసం ప్రయత్నాలు చేస్తుందంటూ బ్రిటన్ మీడియా కథనాలు వెలువరించింది.
కోహినూర్ వజ్రం అంటే తెలియని వారు ప్రపంచంలోనే ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. దేశ విదేశాల్లో ఎన్నో రకాల వజ్రాలు ఉన్నప్పటికి కోహినూర్ వజ్రానికి ఉన్న ప్రాముఖ్యతే వేరు. అన్ని వజ్రాల్లో కెళ్లా అత్యంత విలువైన వజ్రంగా దీనిని చెప్పవచ్చును. తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం కోసం ఎన్నో యుద్దాలు జరిగాయి. ఎన్నోరాజవంశాల చేతులు మారిన ఈ వజ్రం అంతిమంగా దేశం దాటి బ్రిటన్ కు చేరింది. ఇటీవలి కాలంలో కోహినూర్ వజ్రం భారత్ తీసుకురాబోతుందంటూ బ్రిటన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై అధికార వర్గాలు స్పందించాయి.మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
యూకె, భారత్ ఇరుదేశాల్లో కోహినూర్ వజ్రంపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వ్రజం ఇప్పుడు ఎవరికి దక్కుతుందని బ్రిటన్‌లో చర్చిస్తుండగా.. అది తమదని.. తమ దేశానికి అప్పగించాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన కింగ్ ఛార్లెస్-3 పట్టాభిషేకంలో రాణి కెమిల్లా కిరీటంలోని కోహినూర్ వజ్రం చూపరులను ఆకర్షించింది. యూకెకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ పత్రిక తన నివేదికలో కోహినూర్ ను తిరిగి తీసుకురావడం కోసం భారత్ ప్రయత్నిస్తోందని వెల్లడించింది. యూకే లోని మ్యూజియంలోని కోహినూర్ వజ్రంతో పాటు ఇతర కళాఖండాలను తిరిగి తీసుకొచ్చేందుకు దౌత్య మార్గాలను భారత్ సమీకరించినట్లు బ్రిటీష్ మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే ఈ కథనాలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, దౌత్య అధికార వర్గాలు ఖండించాయి. అంతర్జాతీయంగా ఉన్న దౌత్య సంబంధాల ద్వారా పురాతన వస్తువులను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గ్లాస్గో లైఫ్ స్వచ్ఛంద సంస్థ దొంగిలించబడిన ఏడు కళాఖండాలను భారతకు తిరిగి అప్పగించడానిక కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం పై సంతకం చేసింది. బ్రిటన్‌ను పాలించిన రాణి ఎలిజబెత్-2.. 96 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆమె ప్లాటినం కిరీటంలోని ఈ వజ్రం ఇప్పుడు ఎవరికి దక్కుతుందన్న చర్చ జరుగుతోంది.
1937లో కింగ్ జార్జి-6 పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం కోహినూర్ వజ్రం ఉంది. ఒకప్పుడు 793 క్యారెట్లు ఉన్న ఈ వజ్రం.. ఇప్పుడు 105.6 క్యారెట్లకు తగ్గిపోయింది. అప్పటి పంజాబ్ పాలకుడైనా మాహారాజా రంజిత్ సింగ్ ఖజనా నుంచి బ్రిటీష్ వారు చేజిక్కించుకున్నారు. పంజాబ్ విలీనమైన తరువాత క్వీన్ విక్టోరియాకు ఈ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. అలా బ్రిటన్ కు తరలివెళ్లిన.. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తెచ్చే విషయంలో భారత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అదే విషయాన్ని బ్రిటన్ మీడియా నివేదికల్లో పేర్కొన్నాయి. మరి.. బ్రిటన్ మీడియాలో వెలువడిన కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.