ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక సినిమాలో సాంగ్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పుష్ప సాంగ్సే వినిపిస్తున్నాయి. ఊ అంటావా మావ.. ఊహు అంటావా, శ్రీవల్లి, సామి సామి పాటల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇది కూడా చదవండి : Pushpa Copy: పుష్ప కథ కాపీనా? ఆధారాలు బయటపెట్టిన జర్నలిస్ట్!
ఇక శ్రీవల్లి పాటలకు సామాన్యులే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ తరహాలో స్టెప్పులేసి.. ఆకట్టుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో మరో సెన్సేషన్ కి తెర లేచింది. పుష్ప చిత్రంలోని శ్రీవల్లీ సాంగ్ ను ఇంగ్లీష్ లో పాడి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంగ్లీష్ గాయని ఎమ్మా హీస్టర్స్ శ్రీవల్లి ఆంగ్ల వెర్షన్ను రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని దేవీ శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ.. ఎమ్మా హీస్టర్స్ పాడిన పాటను షేర్ చేశారు.
ఇది కూడా చదవండి : శ్రీవల్లి పాట విని ఏడుపు ఆపిన పసిపాప.. వీడియో వైరల్‘‘ఇది చాలా బాగా నచ్చింది. హే సిధ్ శ్రీరామ్ బ్రో.. మనం రికార్డ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను గుర్తుందా.. ఇంగ్లీష్ వర్షన్ 4 ఫన్నీగా చెద్దామని. కానీ ఇక్కడ ఎమ్మా హీస్టర్స్ అందంగా పాడారు. మనం కూడా మన వర్షన్ ని ప్రయత్నిస్తే బాగుటుంది” అంటూ ఇందుకు సంబంధించిన వీడియోని ట్విటర్ లో షేర్ చేశారు దేవీశ్రీ ప్రసాద్. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. శ్రీవల్లి ఆంగ్ల వెర్షన్ విన్న నెటిజన్స్ అదిరిపోయిందని… వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో శ్రీవల్లి పాటను సిధ్ శ్రీరామ్ పాడగా.. హిందీలో జావేద్ అలీ ఆలపించారు.
Loved this🎶❤️🎶
Hey @sidsriram bro,I told U when we recorded,lets do an English version 4 Fun,but here’s a lovely cover by @emmaheesters 😎🎶😍
May be we shud do our version too🎤 @alluarjun @aryasukku @javedali4u @boselyricist @adityamusic @TSeries https://t.co/9K3qAD4o1H
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 5, 2022
ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. ఇక పుష్ప.. ది రూల్ సెకండ్ పార్ట్ షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభించనున్నారు.