టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. అప్పుడు గానీ ఏం జరిగిందనేది తెలియదు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు పలు విషయాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీతో బిజీగా ఉన్న సుకుమార్.. వరల్డ్ వైడ్ వండర్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఫస్ట్ పార్ట్.. ఓవరాల్ గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అసలు విషయానికొస్తే.. ‘ఆర్య’తో డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుకుమార్.. ఆ తర్వాత మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేశారు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. దీనిపై కుమారి 21F తీసి హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన స్క్రీన్ ప్లే, అందించిన నిర్మాణంలో భాగమైన ‘విరూపాక్ష’ రిలీజ్ కు రెడీగా ఉంది. అలానే ‘పుష్ప 2’ నిర్మాణంలో సుకుమార్ భాగమయ్యారు. అలానే సుకుమార్ రెమ్యునరేషన్స్ గురించి గతంలో చాలా వార్తలొచ్చాయి. బహుశా ఈ కారణంగానే ఆయన ఇంటిపై తాజాగా ఐటీ రైడ్ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి డీటైల్స్ వస్తే గానీ ఏం జరిగిందనేది తెలుస్తుంది.
#BREAKING దర్శకుడు సుకమార్ ఇంటి పై కూడా ఐటీ రైడ్!
— devipriya (@sairaaj44) April 19, 2023