శ్రీవల్లి పాట విని ఏడుపు ఆపిన పసిపాప.. వీడియో వైరల్

ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవి పలు బాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. దక్షిణాదితో సహా నార్త్‌లోనూ అల్లు అర్జున్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.

ఇక పుష్ప మూవీలోని పాటలు, డైలాగులు సోషల్‌ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నాయి. పుష్ప సినిమాలోని.. శ్రీవల్లీ పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాట అన్ని భాషల్లోనూ సూపర్‌ డూపర్ హిట్ అయ్యింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని శ్రీవల్లీ సాంగ్ అలరిస్తోంది.

Pushpa 1 2

అందులోను ఈ పాటకు అల్లు అర్జున్‌ చేసిన సిగ్నేచర్‌ స్టెప్‌ అందరికి తెగ నచ్చేసింది. అందుకే ప్రేక్షకుల నుంచి మొదలు సెలబ్రెటీల వరకు ఈ స్టెప్ ను వేసి సంతోషపడుతున్నారు. తాజాగా షాదాబ్‌ అలీ ఖాన్‌ అనే ఓ నెటిజన్‌ సైతం శ్రీవల్లీ సాంగ్‌ హుక్‌ స్టెప్పులేస్తూ ఏడుస్తున్న పసి పాపను జో కొట్టాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.

పాపను సంతోషపెట్టడానికి శ్రీవల్లి స్టెప్‌ పర్‌ఫెక్ట్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో పాటు కోట్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అన్నట్లు పుష్ప సినిమాలోని ఈ శ్రీవల్లీ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సాంగ్‌ 80 మిలియన్‌ వ్యూస్‌తో పరిగెడుతోంది. శ్రీవల్లి సాంగ్ ను తెలుగులో ప్రముఖ సింగర్ సిద్‌ శ్రీరామ్‌ పాడగా, హిందీ వెర్షన్‌లో జావేద్‌ అలీ ఆలపించారు.